టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అందాల బొమ్మ రష్మిక మందన. ఈ అమ్మడు తెలుగులో ప్రస్తుతం పుష్ప 2 మూవీతో పాటు, విజయ్ వారసుడు సినిమాలో నటిస్తుంది. ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లే కావడం విశేషం. అలాగే రెండు సినిమాల మీద మంచి పాజిటివ్ బజ్ ఉంది. అలాగే హిందీలో ఈమె నటించిన మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. మరో సినిమా కూడా చర్చల దశలో ఉంది. అలాగే బాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ కి జోడీగా ఆషికి3లో రష్మిక నటించబోతుంది అనే టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు రష్మిక రెమ్యునరేషన్ కి సంబందించిన ఒక వార్త మూవీ సర్కిల్ లో వైరల్ గా మారింది. పుష్ప, వారసుడు సినిమాల వరకు ఈమె ఒక్కో మూవీకి 4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ వస్తుంది. అయితే ఇప్పుడు తన ఇమేజ్ పెరగడంతో రెమ్యునరేషన్ ని మరో కోటి రూపాయిలు పెంచినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ లో కూడా క్రేజ్ పెరగడంతో హీరోయిన్ గా తన మార్కెట్ పరిధి కూడా పెరిగిందని రష్మిక మందన భావిస్తుంది. ఈ నేపధ్యంలోనే తన రెమ్యునరేషన్ ని 5 కోట్లకి పెంచినట్లు టాక్ వినిపిస్తుంది. ఎన్ఠీఆర్, కొరటాల సినిమా కోసం రష్మికని హీరోయిన్ గా తీసుకోవాలని భావించగా ఆమె 5 కోట్ల రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసిందని తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో కొరటాల నెక్స్ ఛాయస్ గా మృణాల్ ఠాకూర్ ని ఎంపిక చేసుకున్నారనే మాట వినిపిస్తుంది. అయితే గతంలో టాలీవుడ్ హీరోయిన్స్ కి హైయెస్ట్ గా 3 కోట్ల వరకు మాత్రమే రెమ్యునరేషన్ ఇచ్చేవారు. అయితే సౌత్ సినిమా రేంజ్ పెరగడంతో పాటు హీరోయిన్స్ కి కూడా డిమాండ్ పెరిగింది. ఈ నేపధ్యంలోనే వారి రెమ్యునరేషన్స్ కూడా భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం సౌత్ లో అత్యధికంగా నయనతార 9 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది.తరువాత సమంత 6 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. అనుష్క శెట్టి కూడా 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇక పూజా హెగ్డే, రష్మిక మందన 5 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్, తమన్నా 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.