సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన గుడ్ బై సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాలోనే ఏకంగా బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ కూతురు పాత్రలో నటించే అవకాశం వచ్చింది. సౌత్ లో కమర్షియల్ హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అయిన రష్మిక హిందీలో మాత్రం ఓ చిన్న చిత్రంలో సబ్జెక్ట్ ఒరియాంటెడ్ డ్రామాతో తెరకెక్కిన గుడ్ బై సినిమాలో నటించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కంటెంట్ బేస్ తో తెరకెక్కే సినిమాలతో అయితే నటిగా ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలాగే హిట్ అయితే తరువాత ఎలాగూ తన అందంతో గ్లామర్ హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అవ్వొచ్చు అనుకుంది. అయితే ఈ అమ్మడు నటించిన గుడ్ బై సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ఈ సినిమాకి మొదటి ఆట నుంచి ఏవరేజ్ టాక్ వచ్చింది. ప్రముఖ వెబ్ సైట్స్ కూడా ఏవరేజ్ రేటింగ్స్ నే ఈ చిత్రానికి ఇచ్చాయి. సినిమాలో బిగ్ బి అమితాబచ్చన్, రష్మిక మందన పెర్ఫార్మెన్స్ కి ప్రశంసలు లభించిన కంటెంట్ లో ఓవర్ మెలోడీ డ్రామా ఎక్కువైపోయిందనే టాక్ వినిపిస్తుంది. థియేటర్స్ కి వెళ్లి చూసే రెగ్యులర్ ఆడియన్స్ కి ఇలాంటి డ్రామా అంతగా కనెక్ట్ కాదని తేల్చేశారు. కేవలం ఓటీటీ సినిమాలు చూసే ఫ్యామిలీ ఆడియన్స్ కొంత వరకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉందనే మాట బిటౌన్ సర్కిల్ లో వినిపిస్తుంది.
నటిగా రష్మిక డెబ్యూతో ప్రూవ్ చేసుకున్నా కూడా హిట్ మాత్రం కొట్టలేకపోయింది అనే టాక్ నడుస్తుంది. మొదటి సినిమాతోనే బాలీవుడ్ లో డిజాస్టర్ ని రష్మిక ఖాతాలో వేసుకుంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా సూపర్ స్టార్స్ తో ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తుంది. అందులో పుష్ప2 లాంటి పాన్ ఇండియా సినిమాతో పాటు వారసుడు లాంటి భారీ బడ్జెట్ చిత్రం ఉంది. అయితే హిందీలో మాత్రం ఈ బ్యూటీ యూత్ క్రష్ గా ఉన్న హిట్ మాత్రం కొట్టలేకపోయింది. ఇక ఆమె నటించింది మరో సినిమా మిషన్ మజ్ను కూడా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది. దాంతో రష్మికకి ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.