రష్మిక మందన చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తెలుగులో వారసుడు, పుష్ప2 సినిమాలు ఉండగా హిందీలో గుడ్ బై సినిమా రిలీజ్ కాబోతుండగా, మిషన్ మజ్ను కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. ఇక బాలీవుడ్ ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ ఆషికి 3 కోసం రష్మిక మందనని కన్ఫర్మ్ చేశారనే టాక్ నడుస్తుంది. ఇలా భారీ సినిమాల మధ్య ఆమె స్టార్ హీరోయిన్ గా తన రేంజ్ లోనే కొత్త మూవీస్ కూడా ఒప్పుకుంటుంది అనే టాక్ నడుస్తుంది. ఇక రెమ్యునరేషన్ కూడా ఏకంగా 5 కోట్లు డిమాండ్ చేస్తుందనే మాట వినిపిస్తుంది.
దీంతో పాటు బాలీవుడ్ సినిమాలపై మాత్రమే ఫోకస్ పెట్టిందని, సౌత్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అయితేనే ఒకే చెబుతుందనే మాట వినిపిస్తుంది. ఇలా రష్మిక ఇమేజ్ తో పాటు ఆమె మీద వచ్చే రూమర్స్ కూడా పెరుగుతున్నాయి. అయితే వాటికి చెక్ పెడుతూ ఆమె సౌత్ లో మరో సినిమాకి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అది కూడా కోలీవుడ్ లో మూడో సినిమాకి ఆమె ఒకే చెప్పింది. కార్తీ జోడీగా రష్మిక మందన సుల్తాన్ అనే మూవీలో ఇప్పటికే నటించింది. ఆ సినిమా తమిళంలో మంచి హిట్ అయ్యింది.
తెలుగులో ఏవరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ మూవీ తర్వాత మరల ఇప్పుడు జపాన్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న కామెడీ, కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీకి రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. తమిళంలో కూడా తన మార్కెట్, ఫ్యాన్ బేస్ పెంచుకోవడానికి ఈ అమ్మడు అక్కడ ఫోకస్ పెట్టిందని టాక్. ఇక తెలుగులో అయితే దర్శకులు కూడా రష్మికని పాన్ ఇండియా సినిమాల హీరోయిన్ గానే చూస్తున్నారు. స్టార్ హీరోలకి జోడీగా తీసుకోవడాన్ని ప్రయత్నం చేస్తున్నారు.