సుకుమార్ దర్శకత్వంలో బన్నీ,రష్మీక మందాన కలిసి నటిస్తున్న మూవీ పుష్ప.ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా ఉంది.తాజాగా మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మీక మందాన నేను డైరెక్టర్స్ హీరోయిన్ ను అందుకే ”సామీ సామీ సాంగ్ కోసం నేను చాలా కష్టపడ్డాను అది చూసి నన్ను ప్రశంసిస్తే చాలు అని అన్నది.దీనిపై స్పందించిన ఓ నెటిజన్ అసలు ఈమెను హీరోయిన్‌గా ఎందుకు తీసుకున్నారా బాబు దీని ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాం అంటూ కామెంట్ చేశాడు.
దీనిపై స్పందించిన రష్మిక మందాన ”యాక్టింగో, ఓవరాక్టింగో.. నేను జీవితంలో ఏదో ఒకటి సాధించాను మరి నువ్వు ఏం సాధించావు నాన్నా” అంటూ ఘాటుగా బదులిచ్చి పోకిరికి దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చింది.