తన క్యూట్ యాక్టింగ్ తో సౌత్ సినీ అభిమానులు మనసు కొల్లగొట్టిన రష్మిక తాజాగా బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌తో ఒక అండర్‌వేర్ యాడ్ లో నటించింది.ఈ యాడ్ లో యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా కనిపించిన రష్మిక యోగా చేస్తున్నప్పుడు విక్కీ కౌశల్ మ్యాచో కంపెనీ అండర్వేర్ ను చూసి ఇంప్రెస్ అవుతుంది ఇక ఆ యాడ్ కూడా పూర్తవుతుంది.ప్రస్తుతం ఈ యాడ్ చూసిన నెటిజన్స్ అంతా మ్యాచో కంపెనీని ఇందులో నటించిన రష్మికను ట్రోల్ చేస్తున్నారు.
అమ్మాయిలను తక్కువగా చూపించిన ఈ యాడ్ ను అసలు రష్మిక ఎలా ఒప్పుకుందిరా బాబు అని కొందరు ఇలాంటి చీప్ యాడ్ ను నేను ఎప్పుడూ చూడలేదు అలాంటి ఈ యాడ్ లో రష్మిక కనిపించడం షాకింగ్ గా ఉందంటూ మరికొందరు నెట్టింట విమర్శలు గుప్పిస్తున్నారు.