Rashmi: తెలుగులో బాగా పాపులర్ అయిన బుల్లితెర ప్రొగ్రాంలలో జబర్దస్త్ ఒకటి. ఈటీవీలో వచ్చే ఈ ప్రోగ్రాంకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆదరణ, అభిమానం ఉంది. ఇక ఈ ప్రోగ్రాంకు యాంకరింగ్ చేసే రష్మీకి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్ ప్రారంభం నుండి ఉన్న రష్మి.. నిజానికి తెలుగు అమ్మాయి కాదు. అయినా కూడా తెలుగు నేర్చుకొని యాంకరింగ్ చేస్తోంది.
ఓ వైపు జబర్దస్త్ షో వల్ల ఫేమ్ తెచ్చుకున్న రష్మి.. మరోవైపు వీలు కుదిరినప్పుడల్లా సినిమాలు చేస్తోంది. అయితే ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోగ్రాంకు యాంకర్ గా వ్యవహరించిన హాట్ యాంకర్ అనసూయ.. షోని మానెయ్యగా.. ఇప్పుడు రష్మీ కూడా అలానే చేస్తోందా అనే చర్చ మొదలైంది. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో యాంకర్ రష్మి కనిపించకపోవడంతో ఈ చర్చ మొదలైంది.
యాంకర్ రష్మి ఎన్నో సంవత్సరాలుగా జబర్దస్త్ కార్యక్రామానికి యాంకర్ గా ఉండగా.. ఆమె ఇప్పుడు ఆ కార్యక్రమానికి గుడ్ బై చెప్పిందనే టాక్ వినిపిస్తోంది. ఆమెకు సినిమా అవకాశాలు వస్తున్నందుకే మెల్లిగా ఈ షోలు తగ్గించి, ఫుల్ టైం సినిమాలకు పరిమితం కావాలని చూస్తోందని, అందుకే జబర్దస్త్ కు గుడ్ బై చెప్పినట్లు టాక్.
Rashmi:
కానీ మరికొందరు మాత్రం రష్మి.. జబర్దస్త్ కార్యక్రమాన్ని వీడలేదని అంటున్నారు. ఆమె ఓ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నందుకే తాజాగా ఎపిసోడ్ చేయలేకపోయిందని అంటున్నారు. కాగా తాజాగా విడుదలైన జబర్దస్త్ షో ప్రోమో ప్రకారం.. ఆ షోకి యాంకర్ గా సౌమ్యారావ్ కనిపించింది. గతంలో ఓ ఎపిసోడ్ లో హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ లకు నాన్ స్టాప్ పంచులు వేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించింది. అయితే సౌమ్యా రావ్ ఒక ఎపిసోడ్ మాత్రమే చేస్తుందా.. లేదంటే రష్మి స్థానంలో పూర్తిస్థాయి యాంకర్ గా కొనసాగుతుందా అనేది చూడాలి.