Rashmi Gautam: జబర్దస్త్ కామెడీ రియాల్టీ షో తో పాపులర్ అయిన హాట్ యాంకర్ రష్మి. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడో నటిగా కెరియర్ ప్రారంభించిన రష్మీకి జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత హీరోయిన్ గా గుంటూరు టాకీస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ ని ఖాతాలో వేసుకుంది. తర్వాత కెరియర్ లో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన కూడా రష్మీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. దీనికి కారణం కేవలం తనకున్న డిమాండ్ ని క్యాష్ చేసుకోవడానికి రష్మీ చిన్నచిన్న సినిమాలలో కూడా నటించడమే అనే విమర్శ ఉంది. అసలు కథ బలం లేకుండా ఉన్న సినిమాలు కూడా ఒప్పుకొని కెరియర్ పరంగా తనని తానే వెనక్కి నెట్టుకుందనే మాట టాలీవుడ్ లో వినిపిస్తుంది.

అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో రష్మీకి ఒక ఇంట్రెస్టింగ్ పాత్ర లభించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికీ జబర్దస్త్ లో యాంకర్ గా కొనసాగుతున్న రష్మీ మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ షో కూడా లీడ్ చేస్తుంది. అలాగే పండగ సందర్భంగా నిర్వహించే స్పెషల్ ఈవెంట్స్ కు కూడా రష్మీ యాంకర్ గా ఉంటుంది. ఈటీవీలో యాంకర్ గా రష్మీకి హై ప్రయారిటీ లభిస్తుంది. యాంకర్ కాంపిటేషన్ నుంచి అనసూయ తప్పుకోవడంతో ఇప్పుడు ఆ అవకాశాలను రష్మీ సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే రష్మీ గురించి తాజాగా టాలీవుడ్ లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
త్వరలో జరగబోయే బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో ఈమె పార్టిసిపేట్ చేయబోతుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే చాలాసార్లు రష్మీని సంప్రదించడం జరిగిందని సమాచారం. అయితే ఎప్పుడు కూడా ఆమె ఈ షోలో పాల్గొనడానికి ఆసక్తి చూపించలేదు. అయితే సీజన్ సెవెన్ కోసం ఆమెకు అందరికంటే హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి బిగ్ బాస్ టీం సిద్ధం కావడంతో ఈసారి పార్టిసిపేట్ చేయాలని రష్మీ గౌతమ్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఈమె పేరు ప్రస్తుతం గట్టిగా వినిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7 లో పార్టిసిపేట్ చేసేవాళ్లు లిస్టు ఇప్పటికే స్టార్ మా టీం రెడీ చేస్తుందని సమాచారం. ఎప్పటిలాగే సినీ సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా సెలబ్రిటీలని కూడా ఎంపిక చేస్తున్నట్లుగా సమాచారం. అలాగే సీరియల్ స్టార్స్ ను కూడా సీజన్ 7 కోసం ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తుంది.