నటిగా, స్టార్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ రష్మి గౌతమ్. ఈ బ్యూటీ హీరోయిన్ కావాలని టాలీవుడ్ లో అడుగుపెట్టింది. కెరియర్ ఆరంభంలో అడపాదడపా చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చింది. అయితే జబర్దస్త్ యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసాక ఆమె ఫేట్ మారిపోయింది. పొట్టి పొట్టి డ్రెస్సులుతో తన హాట్ అందాలని చూపిస్తూ జబర్దస్త్ షోకి గ్లామర్ తీసుకొచ్చింది. రష్మి, అనసూయ కారణంగానే జబర్దస్త్ కామెడీ షో బాగా పాపులర్ అయ్యిందని చెప్పాలి. ఇక జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్, రష్మికి మంచి జోడీ కుదిరింది. టెలివిజన్ లో వీళ్ళ ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి మంచి హైప్ క్రియేట్ అయ్యింది. వీళ్ళ జోడీ బాగుందనే కామెంట్స్ వచ్చాయి.
దీంతో వారిద్దరిని మరింతగా రియాలిటీషోలలో హైలైట్ చేసేవారు. కొన్ని ఈవెంట్స్ లో వారిద్దరికి పెళ్లి కూడా చేసేసారు. ఇక రష్మి, సుధీర్ ఆన్ స్క్రీన్ జోడీగా మంచి సక్సెస్ కావడంతో పాటు బాగా ఫేమ్ సొంతం చేసుకోవడంతో ఢీ డాన్స్ రియాలిటీషోలలో వీరిని టీమ్ లీడర్స్ గా చేసి రెండు సీజన్స్ నడిపించారు. ఆ రెండు సీజన్స్ బాగా సక్సెస్ అయ్యాయి. సుమారు వీరిద్దరూ కలిసి కనిపించిన ప్రతి రియాలిటీ షో బాగా హిట్ అయ్యింది.దీంతో ఆన్ స్క్రీన్ పెయిర్ అయిన వీరిద్దరి మధ్య ఆఫ్ స్క్రీన్ లో కూడా మంచి బాండింగ్ ఉందనే టాక్ వచ్చింది. ఇద్దరు డేట్ లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం నడిచింది.
అయితే చాలా సందర్భాలలో ఈ విషయాన్ని వారు పలు ఇంటర్వ్యూలలో ఖండించిన, మళ్ళీ తెరపై జోడీగా కనిపించినప్పుడు ప్రచారం తెరపైకి వచ్చేది. దీంతో ఆ గాసిప్ ని ఇక కంట్రోల్ చేయడం కష్టం అని ఇద్దరూ పట్టించుకోవడం మానేసి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. సుధీర్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇక రష్మి గౌతమ్ కూడా యాంకర్ గా, నటిగా సక్సెస్ ఫుల్ గా జర్నీ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీని ఓ ఇంటర్వ్యూలో సుధీర్ తో ప్రేమాయణం గురించి మరో సారి అడిగారు.
మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందనేది మా వ్యక్తిగత విషయం అని రష్మి చెప్పుకొచ్చింది. భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చని, దేనిని మనం ఆపలేమని చెప్పింది. మేమిద్దరం పదేళ్ల నుంచి కలిసి ప్రయాణం చేస్తున్నామని, అందుకే మా ఇద్దరి జోడీ ఆన్ స్క్రీన్ పై బాగా క్లిక్ అయ్యిందని చెప్పింది. అయితే తమ రిలేషన్ లో ఏమైనా కొత్తగా అప్డేట్ ఉంటే కచ్చితంగా చెబుతానని చెప్పుకొచ్చింది.