Rashi Khanna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఎంతైతే క్రేజ్ ఉంటుందో, హీరోయిన్లకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. ఓరకంగా చెప్పాలంటే హీరోయిన్లు ఒక్క సినిమాతో రాత్రికి రాత్రి ఫ్యాన్స్ పుట్టుకొచ్చేస్తారు. హీరోయిన్ కు డైహార్ట్ ఫ్యాన్స్ కూడా పుడుతుంటారు. అయితే తెలుగులో ఓ హీరోయిన్ పరిస్థితి ఎన్ని సినిమాలు తీసినా పెద్దగా మారడం లేదు.
2013లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్ రాశి ఖన్నా.. తెలుగులో ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇప్పటికి ఈ ఢిల్లీ ముద్దు గుమ్మ పాతిక సినిమాలకు పైగా చేసినా కానీ ఈమెకు పెద్దగా స్టార్ డంని మాత్రం తీసుకురాలేకపోయాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీలలో కూడా ఈ అమ్మడు సినిమాలు చేస్తోంది.
మామూలుగా అయితే మూడు నాలుగు సినిమాలకు హీరోయిన్లకు మంచి క్రేజ్, ఫాలోయింగ్ వచ్చేస్తాయి. అలాగే భారీ ప్రాజెక్టుల్లో అవకాశాలు కూడా వస్తుంటాయి. కానీ రాశి ఖన్నా పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఈ అమ్మడికి అలాంటివి ఏమీ రాకపోయినా సినిమాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఏదో సినిమాలు వస్తున్నాయి, పోతున్నాయ్ కానీ.. అమ్మడికి మాత్రం గుర్తింపు రావడం లేదు.
Rashi Khanna:
బెంగాల్ టైలర్, సుప్రీం, జై లవకుశ, రాజా దిగ్రేట్, తొలిప్రేమ, వెంకీమామ, ప్రతిరోజు పండగే లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టి హిట్ అయినా కానీ ఈ సినిమాల్లో నటించిన రాశిఖన్నాకు మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు, పాతిక సినిమాలు చేసినా అమ్మడి కెరీర్ టర్న్ తీసుకోకపోగా.. ఇంకెప్పుడు వస్తుందనే చర్చ సాగుతోంది.