బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మొదటి సారి మాస్ ఆడియన్స్ ని అలరించే పాత్రలో రామ్ ఈ మూవీలో కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే రామ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాని బోయపాటి తెరకెక్కించడానికి ప్లాన్ చేశారు. అఖండ సినిమాతో మంచి ఊపు మీద ఉన్న బోయపాటి ఈ మూవీతో తాను కూడా పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోవాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే తన మాస్ బీట్ కి ఈ సారి యూనివర్శల్ టచ్ ఇవ్వాలని మాఫియా బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్తుంది అనుకుంటే ముందుకి కదలడం లేదు. బోయపాటి ఈ సినిమా కోసం ఏకంగా 70 నుంచి 80 కోట్ల వరకు బడ్జెట్ చెప్పినట్లు తెలుస్తుంది. అయితే హీరో రామ్ మార్కెట్ గట్టిగా తిప్పి కొట్టిన 40 కోట్లు దాటదు అలాటింది ఏకంగా అన్ని కోట్లు బడ్జెట్ పెట్టడం అంటే కష్టం అని భావించి నిర్మాతలలో ఒకరైన శ్రీనివాస్ చిట్టూరి ఆగినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ది వారియర్ మూవీతో శ్రీనివాస్ డిజాస్టర్ ని ఖాతాలో వేసుకొని కమర్షియల్ గా కొంత నష్టాల్లో ఉన్నాడు. అయితే రామ్ దీంతో రామ్ రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా అని చెప్పి శ్రీనివాస్ తో నెక్స్ట్ సినిమా చేయడానికి ఒకే చెప్పాడు.
అయితే అది బోయపాటి సినిమా కావడమే ఇప్పుడు అస్సలు సమస్య. బోయపాటి చెప్పిన బడ్జెట్ పరిధులు దాటిపోయి ఉండటంతో నిర్మాత కొద్దిగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. బోయపాటి, స్రవంతి రవి కిషోర్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నా మెజారిటీ బడ్జెట్ అంతా శ్రీనివాస్ చిట్టూరిదే ఈ కారణంగానే అతను ఈ సినిమా నిర్మాణం విషయంలో పునరాలోచనలో పడినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే సినిమా ఆగే పరిస్థితి లేకపోయిన బోయపాటిని బడ్జెట్ కంట్రోల్ చేయమని సూచిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనే ఆసక్తి ఫిల్మ్ నగర్ సర్కిల్ లో నెలకొని ఉంది.