Ranaveer Singh : బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటోలు ఇటీవల ఇంటర్నెట్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఒక పేపర్ మ్యాగజైన్ కోసం ఆయన ఒంటి మీద నూలు పోగు లేకుండా నగ్నంగా ఫొటోలకు పోజులిచ్చి.. తీవ్ర విమర్శల పాలయ్యాడు. ఈ ఫోటో షూట్ వైరల్ అవడంతో ఓ ఎన్జీవో సంస్థ రంగంలోకి దిగింది. మహిళల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఫొటోలు ఉన్నాయంటూ సదరు ఎన్జీవో సంస్థ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవలే ఈ కేసులో పోలీస్ స్టేషన్‌కు హాజరై వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఈ కేసు విచారణలో రణ్‌వీర్ పెద్ద ట్విస్టే ఇచ్చినట్టు సమాచారం.
నిజానికి ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆ ఫోటో షూట్‌లో భాగంగా వైరల్ అయిన ఫోటోలలో ఒకటి తనది కాదని.. ఎవరో మార్ఫింగ్ చేశారని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. దానిని కావాలనే మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారని చెప్పినట్టు సమాచారం. అసలు ఆ ఫోటోను తాను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయలేదని రణవీర్ పోలీసులకు చెప్పాడట. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు ఆ ఫొటోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి అది మార్ఫింగ్ చేయబడిందా..? లేదా..? అని నిర్ధారిస్తున్నట్లు సమాచారం.
Ranaveer Singh : డబ్బులున్నోళ్లు ఎన్ని జిమ్మిక్కులైనా చేయవచ్చు..
ఫోటో మార్ఫింగా.. కాదా? అనేది పక్కనబెడితే ఆయనేమైనా స్టార్ హీరోయినా? లేదంటే అందమైన అమ్మాయా? మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయను. అయినా చేశారనే అనుకుందాం. మరి ఈ విషయాన్ని ఇంతకాలం ఎందుకు బయట పెట్టలేదు? అప్పుడే చెప్పి ఉండొచ్చు కదా. తీరిగ్గా ఇప్పుడు చెప్పడం ఎందుకు? ఎవరిని పిచ్చోళ్లను చేయాలని? అసలు ఇదంతా విచారణను ప్రొలాంగ్ చేయడానికేనని తెలుస్తోంది. మరోవైపు జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులైనా పెట్టొచ్చని.. డబ్బులున్నోళ్లు ఎన్ని జిమ్మిక్కులైనా చేయవచ్చని నెట్టింట చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా ఒకవేళ ఆ ఫొటో మార్ఫింగ్ అని తేలితే మాత్రం.. ఈ కేసులో రణవీర్ సింగ్ క్లీన్ చిట్ పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఒక్క ఫొటోపైనే ఆయనపై కేసు నమోదైంది. తాను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఏడు చిత్రాలు అశ్లీలంగా లేవని రణ్‌వీర్ సింగ్ చెప్పారని ఓ అధికారి తెలిపారు. జూలై 26న రణ్‌వీర్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఆగస్టు 29న ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు.