Rana Daggubati : బాహుబలి మూవీతో నేషనల్ వైడ్‌గా పాపులారిటీ తెచ్చుకున్న నటుల్లో రానా ఒకరు. ఒక్క హీరో పాత్రలకే స్టిక్ ఆన్ అవకుండా విలన్‌గానూ ఇతర పాత్రల్లోనూ నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రానా గత ఏడాది తను ప్రేమించిన యువతి మిహిక బజాజ్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా? అని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. దగ్గుబాటి వారసుడు రాబోతున్నాడనే టాక్ చాలా బలంగానే వినిపిస్తోంది.
తాజాగా రానా, మిహిక తల్లిదండ్రులు కాబోతున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో కానీ.. మొత్తానికి దగ్గుబాటి ఫ్యామిలీ ఫుల్ ఖుషీలో ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతారని కూడా టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే దగ్గుబాటి ఫ్యామిలీలో ఎవరో ఒకరు స్పందించే వరకూ వెయిట్ చేయాల్సిందే. కొంతకాలంగా ఈ జంటకు విభేదాలు ఉన్నాయనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అయితే మిహీకా కర్వా చౌత్ సందర్భంగా పెట్టిన పోస్ట్‌తో ఈ ఊహాగానాలన్నింటికీ చెక్ పెట్టేసింది.
ఇక రానా సినిమాల విషయానికి వస్తే ఒకవైపు సినిమాలను నిర్మిస్తూనే మరోవైపు హీరోగా రాణిస్తున్నాడు. ఇక ప్రస్తుతం వెబ్ సిరీస్ యుగం నడుస్తోంది కాబట్టి వెబ్ సిరీస్‌ల ద్వారా కూడా ప్రేక్షకులను అలరించేందుకు రానా సిద్ధమవుతున్నాడు. త్వరలోనే బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నటించిన వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకీ – రానాలు కలిసి నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ఇది. దీనికి ‘రామానాయుడు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రసిద్ధ అమెరికన్ క్రైమ్ షో రే డోనోవన్ స్ఫూర్తితో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది.