టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సుదీర్ఘకాలం పాటు కొనసాగి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటి రమ్యకృష్ణ.ఇక ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవితో సమానంగా డాన్స్ బీట్స్ చేయగల అతికొద్ది మంది హీరోయిన్స్ లలో రమ్యకృష్ణ కూడా ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోయిన్ గా కెరియర్ క్లోజ్ అయిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. ఇక ఈ సెకండ్ ఇన్నింగ్ లో బాహుబలిలో శివగామి పాత్రతో ఒక్కసారిగా తన ఇమేజ్ ని అమాంతం పెంచేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ లో ఆమె కూడా ఒకరని చెప్పాలి.
ఇక రీసెంట్ గా ఆమె డాన్స్ ఐకాన్ అనే డాన్స్ రియాలిటీషోకి వ్యాఖ్యాతగా కూడా రావడం స్టార్ట్ చేసింది. ఇక ఇందులో చాలా మంది టాలెంటెడ్ డాన్సర్స్ తన నృత్యాలతో ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా నా అల్లుడు సినిమాలో రమ్యకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఓ సాంగ్ చేసింది. ఆ సాంగ్ ని స్టేజ్ మీద కంటిస్టెంట్ లు ప్రదర్శించారు. ఆ ప్రదర్శన చూసి రమ్యకృష్ణ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయారు.
నా అల్లుడు సినిమా జ్ఞాపకాలని గుర్తుచేసుకున్నారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ తో చేసిన ఆ సాంగ్ సమయంలో తాను నాలుగు నెలల గర్భంతో ఉన్నానని, అయినా కానీ తప్పని సరిపరిస్థితిలో ఆ సాంగ్ ని చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అందుకే తనకి సాంగ్ ఎంతో స్పెషల్ అని కూడా రమ్యకృష్ణ షోలో పేర్కొన్నారు. ఆమె చెప్పిన విషయాన్ని విని అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. గర్భవతిగా ఉన్న సమయంలో అసలు శరీరాన్ని కష్టపెట్టకూడదు. అలాంటిది ఏకంగా రమ్యకృష్ణ డాన్స్ చేసి తన డెడికేషన్ చూపించుకున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు.