సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. త్రివిక్రమ్ సినిమా అంటే ఫ్యామిలీ అంశాలతో ఉంటుంది కాబట్టి క్యాస్టింగ్ పరంగా స్ట్రాంగ్ నటులని ఎంపిక చేసుకుంటారు. హీరోతో పాటు బలమైన పాత్రలు ఉండే విధంగా చూసుకుంటారు. ఇక త్రివిక్రమ్ ప్రతి సినిమాలో ఫిమేల్ పాత్రలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయనే సంగతి తెలిసిందే. బలమైన పాత్రలని సృష్టించి వాటి చుట్టూ ఒక ఎమోషన్ ని నడిపించి కథని అందంగా చెప్పే ప్రయత్నం త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తారు.
అలాగే మహేష్ బాబు సినిమాలో కూడా హీరోయిన్ పూజా హెగ్డే చుట్టూనే కథ తిరుగుతుందని తెలుస్తుంది. అలాగే మరో బలమైన ఫిమేల్ రోల్ కోసం సీనియర్ హీరోయిన్ ని తీసుకుంటున్నట్లు టాక్ వస్తుంది. అయితే ఆ పాత్ర కోసం ఇప్పటి వరకు ఎవరూ ఊహించని నటీమణులని ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు మాత్రం స్టార్ నటిని తీసుకుంటున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్ తో సమానైన స్టార్ ఇమేజ్ ని మెయింటేన్ చేస్తున్న రమ్యకృష్ణని ఆ పాత్ర కోసం త్రివిక్రమ్ ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తుంది.
ఇక రమ్యకృష్ణకి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఇదే మొదటి సినిమా కావడంతో ఆమె కూడా అంగీకరించినట్లు తెలుస్తుంది. ఇక త్వరలో రమ్యకృష్ణ ఎంపికపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకు తగ్గట్లుగానే ఇతర బాష నటులని కూడా సినిమా కోసం త్రివిక్రమ్ ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే చిత్ర నిర్మాతలు గాని, లేదంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ కాని అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.