Ramgopal Varma: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ఏదోక వివాదంతో వార్తల్లో ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన.. ఎప్పుడూ ఏదోక అంశం గురించి ట్వీట్ చేస్తూ మంట రేపుతూ ఉంటారు. సామాజిక, రాజకీయ అంశాలపై ఆయన చేసే ట్వీట్లు కలకలం రేపుతూ ఉంటాయి. ప్రతి అంశంపై ఆయన విమర్శనాత్మకంగానే ట్వీట్లు చేస్తూ ఉంటారు. ఏ అంశంపైన అయినా సరే నెగిటివ్ గానే ట్వీట్లు చేస్తూ ఉంటారు.
ఆర్జీవీకి దండ ఎందుకేశారు?
తాజాగా ట్విట్టర్ లో రాంగోపాల్ వర్మ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ బర్త్ డే వేడుకల్లో ఆర్జీవీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆర్జీవీకి మెడలో దండ వేశారు. ఈ ఫొటోను ట్విట్టర్ లో పంచుకున్న ఆర్జీవీ.. తనకు అసలు దండ ఎందుకు వేశారో అర్థం కావడం లేదంటూ పేర్కొన్నాడు. మా వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ బర్త్ డేకి నాకెందుకు దండ వేశారో నాకు అసలు ఏం అర్ధం కావడం లేదు.. వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే టూ దాసరి కిరణ్ కుమార్ అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు.
ఈ ఫొటోలో ఆర్జీవీ మెడలో పెద్ద పూల దండ ఉంది. ఆర్జీవీ త్వరలోనే ఏపీ రాజకీయాలపై వ్యూహం అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు దాసరి కిరణ్ నిర్మాతగా ఉన్నారు. తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్ ను ఆర్జీవీ కలిసిన తర్వాతి రోజే ఈ సినిమాను ప్రకటించారు. దీంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఈ సినిమా తీయబోతున్నారనే టాక్ నడుస్తోంది.
వచ్చే ఎన్నికల కోసం ఆర్జీవీతో జగన్ సినిమా తీయిస్తున్నారని, వైసీపీకి సపోర్ట్ గా ఈ సినిమా ఉంటుందని ప్రచారం సాగుతోంది. వ్యూహం సినిమా రెండు పార్టీలుగా ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఏపీ రాజకీయాల్లో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.