RamCharan: మెగా పవర్ స్టార్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతున్న స్టార్ హీరో రామ్ చరణ్. ‘చిరుత’గా తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’తో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. మగధీర సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్న రామ్ చరణ్, రంగస్థలంతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తెలుగులోని టాప్ హీరోల జాబితాలో రామ్ చరణ్ టాప్ లో కొనసాగుతున్నాడు.
రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళితో కలిసి‘ఆర్ఆర్ఆర్’ చేయగా.. అది భారీ హిట్ అయింది. ఈ సినిమాలో రామరాజుగా రామ్ చరణ్ కు మంచి గుర్తింపు రాగా.. యాక్షన్ సీన్లు వేరే లెవల్ ఉండటంతో అవి ప్రేక్షకులను అలరించాయి. ఇక ఈ సినిమా తర్వాత భారీ సినిమాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాతగా రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నాడు.
‘RC15’ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా కియారా అద్వానీ చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద తెర కెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మితమవుతుండగా.. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
RamCharan:
ఈ సినిమాను ఎంతో భారీగా తెరకెక్కిస్తున్న డైరెక్టర్ శంకర్.. నవంబర్ రెండోవారంలో ఒక షెడ్యూల్ షూటింగ్ పెట్టుకోబోతున్నాడట. ఈ షెడ్యూల్ లోనే రామ్ చరణ్ తో ఒక పాటను ప్లాన్ చేశాడని, అది ఎంతో గ్రాండియర్ లెవల్లో ఉండబోతోందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ పాట షూటింగ్ కోసం పలు దేశాల్లో లొకేషన్స్ ని కూడా సెలెక్ట్ చేశారట. భారీ లెవల్ లో ఉండే ఈ పాట సినిమాకు హైలెట్ గా ఉండబోతోందనే టాక్ ఉంది.