Ramcharan: తమిళ నాట సూపర్ హిట్ అయిన మూవీ `ఓ మై కడవులే’.. ఆధారంగా తెలుగులో రూపొందుతున్న చిత్రం `ఓరి దేవుడా!`. ఈ సినిమాలో మాస్ కా బాప్ గా పేరుతెచ్చుకున్న విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు. విక్టరీ వెంకటేష్ దేవుడిగా ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. మిథిలా పాల్కర్, ఆశ భట్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి అశ్వత్ మారి ముత్తు దర్శకత్వం విహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు పీవీపీ సినిమా సంయుక్తం నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం, రాజమండ్రిలో ఘనంగా జరిగింది.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అంతే కాకుండా తనదైన శైలిలో ప్రసంగించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ `రామ్ చరణ్ అన్న జర్నీ నాకు ఎంతో స్ఫూర్తి దాయకం. మిమ్మల్ని చూసి నేనూ మీలా డిసిప్లిన్ గా వుండాలనుకుంటున్నాను. మీరు ఈ కార్యక్రమానికి రావడాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటా. ఎందుకంటే నా తొలి సినిమా `ఫలక్ నుమాదాస్` కోసం నాని అన్నా వచ్చాడు. ట్రైలర్ లాంచ్ కి వెంకటేష్ గారొచ్చారు. ఆయనని అడిగిన వెంటనే ఈ మూవీలో దేవుడి పాత్రలో నటించడానికి అంగీకరించారు.” అని ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు.
ఇక హీరో రామ్ చరణ్ గారు “నేను కానీ నాన్నగారు కానీ సినిమాని ఎంత ప్రేమిస్తాము, మంచి సినిమాని ఆదరిస్తాము. ఇంత మంది ప్రేక్షకులు రావడం వల్ల మంచి సినిమాని ఆదరించే మంచి గుణం వుందని నిరూపించారు. ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నా. ఈ మూవీలో బాస్ ఆఫ్ కామెడీ గా పేరున్న వెంకటేష్ గారిని కీలక అతిథి పాత్ర కోసం తీసుకున్నారు. విశ్వక్ సేన్.. ఆంధ్ర ప్రదేశ్.. తెలంగాణ గల్లీ గల్లీలో.. నీవు తెలియని వాళ్లు ఎవరు ఉండరు. మంచి పాత్రలతో ఫలక్ నుమా నుంచి రాజమండ్రి వరకు వైజాగ్ నుంచి చిత్తూరు వరకు గల్లీ గల్లీలో తనకు ఫ్యాన్స్ వున్నారు. ఆ మాటకొస్తే నేనూ విశ్వక్ పర్సనాలిటీకి పెద్ద అభిమానిని.” అని ప్రసంగంలో పేర్కొన్నాడు.
అలాగే.. “సినిమాలో కన్నా నేను విశ్వక్ సేన్ కు బయట పెద్ద ఫ్యాన్ ని. తన క్యారక్టర్ నాకు చాల ఇష్టం. ఇచ్చిన మాట చెప్పిన మాటపై నిలబడే వారు ఎవరైనా నాకు చాలా అభిమానమే. అలా నిలబడతానని నాకు మంచి పేరుంది. మంచో చెడో విశ్వక్ సేన్ నిలబడతాడనే టాక్ అందరిలో వుంది. ఇలాగే నువ్వు కంటిన్యూ చెయ్..” అంటూ సలహా ఇచ్చాడు.
Ramcharan:
ఇదిలా ఉండగా ఈ నెల 21న విడుదలవుతున్న మూవీని అందరూ థియేటర్ కి వెళ్లి చూసి ఆదరించాలని పిలుపునిచ్చారు. ఇక అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో మిథిలా పాల్కర్, ఆశ భట్, అశ్వత్ మారిముత్తు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ కాక తో పాటు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు.