The Warrior : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా ఆది పినిశెట్టి విలన్‌గా నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘ది వారియర్’. రామ్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడంతో ఈ సినిమా ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. తెలుగు, తమిళ భాషల్లో బై లింగ్వల్‌గా తెరకెక్కించారు. లింగు సామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. టీజర్స్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నేడు(జూలై 14)న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే ట్విటర్ రివ్యూ అయితే హిట్ అనే వచ్చింది. మరి బయటకు వచ్చిన పబ్లిక్ ఏమంటున్నారు? ఈ సినిమాను బాగా రిసీవ్ చేసుకున్నారా? లేదంటే ఫ్లాప్ టాక్ ఏమైనా ఇచ్చారా?
The Warrior : 3.5 రేటింగ్ ఇస్తున్న పబ్లిక్
‘ది వారియర్’ చూసిన ప్రేక్షకులు ఈ సినిమా తప్పక హిట్ అవుతుంది అనే చెబుతున్నారు. ఇదొక ఫుల్ మీల్స్ అని అభిప్రాయ పడుతున్నారు. ఫైట్స్, కామెడీ హైలైట్ అని.. హీరోయిన్ కృతి శెట్టి అందంగా ఉందని చెబుతున్నారు. పోలీస్ క్యారెక్టర్ రామ్ ఒదిగిపోయారు. యూత్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెబుతున్నారు. మ్యూజిక్ 100 శాతం సెట్ అయిందని సీన్స్‌కు తగ్గట్టు బీజీఎం చాలా బాగుందని చెప్పారు. 3.5 రేటింగ్ ఇవ్వడం విశేషం. బేబమ్మ సైతం స్టార్టింగ్‌లో అదరగొట్టిందని తెలిపారు. అక్కడక్కడ కొన్ని అప్‌అండ్ డౌన్స్ ఉన్నా కూడా సినిమా బాగుందని.. డైరెక్షన్ సూపర్బ్ అని అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటి వరకైతే సినిమాకు ఆడియన్స్ మంచి రిపోర్టే ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే రామ్‌కు మరో హిట్ ఖాయంగానే కనిపిస్తోంది.
ట్విటర్ రివ్యూలో కూడా ఆడియన్స్ మంచి రిపోర్టే ఇచ్చారు. ఫస్టాఫ్ కాస్త ఫన్నీగా.. సెకాండాఫ్‌లో భారీ యాక్షన్ సీన్స్‌తో సినిమా రూపొందిందని ఆడియన్స్ టాక్. డైరెక్టర్ లింగుస్వామికి ఈ సినిమా బౌన్స్ బ్యాక్ అవుతుందని చెబుతున్నారు. యాక్షన్ ఎపిపోడ్స్‌లో రామ్ యాక్టింగ్ అదరగొట్టేశాడని చెబుతున్నారు. ఇక సినిమాకి వస్తోన్న ముందస్తు టాక్ ప్రకారం, సెన్సార్ రిపోర్ట్ ప్రకారం, ట్విట్టర్‌లో వస్తోన్న టాక్ ప్రకారం.. సినిమా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అనడంలో సందేహం లేదని చెబుతున్నారు. మొత్తానికి ఆడియన్స్ సినిమా అదరగొడుతోందనే చెబుతున్నారు.