Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ రూటే సపరేటు. ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ ఏం చేసినా అది సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. నిజానికి ఆయన చేసే కొన్ని పనులు కావాలని చేస్తాడా లేదా పబ్లిసిటీకి చేస్తాడా అన్న విషయాన్ని పక్కన పెడితే అమ్మాయిల విషయంలో కాస్త ఆడ్‌గానే బిహేవ్ చేస్తాడని ఇండస్ట్రీలో రామ్‌గోమాల్ మీద పెద్ద టాక్ ఉంది. తాజాగా రామ్‌గోపాల్ చేసిన ఓ పనికి ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు.

Ram Gopal Varma : ఏదైనా సినిమా విడుదలకు రెడీగా ఉంటే ఆ సినిమాను హైలెట్ చేసేందుకు రామ్‌గోపాల్ వర్మ్ సోషల్ మీడియా స్ట్రాటజీని ఉపయోగిస్తాడని ఇండస్ట్రీ టాక్. కాంట్రవర్సీ కామెంట్లు, ట్వీట్స్ పోస్ట్ చేస్తూ అందరూ తనగురించి మాట్లాడుకునేలా చేస్తాడంటారు. అందుకే రామ్‌గోపాల్‌ను కాంట్రవర్సీల కింగ్ అని పిలుస్తారు. ఈ మధ్యన మరో కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు రామ్. హాట్ బుల్లితెర యాంకర్లతో ఇంటర్వ్యూలు చేస్తూ తెగ హంగామా చేస్తున్నారు. ఇప్పటికే అరియానా, ఆషూ రెడ్డీలతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి జనాలకు పిచ్చెక్కించాడు ఈ దర్శకుడు. తాజాగా మరోసారి హాట్ బ్యూటీ ఆషూ రెడ్డితో ఇంటర్వ్యూ చేసి అందరి అటెన్షన్‌ను తనవైపుకు తిప్పుడుకున్నాడు. ఇంటర్వ్యూలో భాగంగా రామ్ గోపాల్ వర్మ చేసిన ఓ పని అందరిని అవాక్కు అయ్యేలా చేస్తోంది. ఆషు రెడ్డి కుర్చీలో కూర్చుంటే రామ్ కింద కూర్చుని తన పాదాలను పట్టుకుని ముద్దాడి, నాకి చప్పరించి వింత చేష్టలు చేశాడు. ఇది చాలా టూమచ్‌గా ఉందంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇంతలా ఆర్జీవీ ఎందుకు దిగజారాడంటూ ఫైర్ అవుతున్నారు.

రామ్ గోపాల్ వర్మ డేంజరస్ అనే చిన్నబడ్జెట్ మూవీతో మరోసారి వెండితెర ముందుకు వస్తున్నాడు. ఈ మూవీని ప్రమోషన్ చేద్దామనేమో ఆషూ రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు రామ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆర్జీవీ తన మూవీ కోసం ఎంతకైనా దిగజారుతాడని మరోసారి ఈ ఇంటర్వ్యూతో నిరూపించాడంటున్నారు నెటిజన్లు.