Ram Charan – Upasana Konidela: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి మెగా కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ఉపాసన అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సొసైటీలో ఉపాసనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఓవైపు మెగా ఇంటి బాధ్యతలను చూసుకుంటూనే మరోవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు.
ఇలా వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా బిజీగా గడుపుతున్న ఉపాసన రామ్ చరణ్ వివాహం చేసుకొని పది సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఇంకా వీరికి పిల్లలు లేకపోవడంతో తరచూ వీరు పిల్లల గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే మెగా వారసుడు కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇక ఇదే విషయంపై ఉపాసనను పలుమార్లు ప్రశ్నించిన ఈమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
పిల్లలు కనడం అనేది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని అయితే తాను చెప్పాల్సిన సమయంలోనే ఈ ప్రశ్నకు సమాధానం చెబుతాను అంటూ తరచూ పిల్లలకు గురించి ప్రశ్నలు ఎదురైతే ఆ ప్రశ్నలను దాట వేస్తూ ఉంటారు. ఇకపోతే తాజాగా గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఉపాసన తన డ్రైవర్ ఆహ్వానం మేరకు తన ఇంటిలో జరిగిన ఉత్సవాలకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఈమె బేబీ బంప్ తో కనిపించడంతో పెద్ద ఎత్తున ఉపాసన తల్లి కాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

Ram Charan – Upasana Konidela: ఫేక్ ఫోటో క్రియేట్ చేసి రచ్చ రచ్చ
ఇకపోతే ఉపాసన రాంచరణ్ ఇద్దరు వినాయకుడి ప్రతిమను పట్టుకొని ఉన్నటువంటి ఫోటోలో కూడా ఉపాసన బేబీ బంప్ క్లియర్ గా కనిపించడమే కాకుండా ఈమెలోశారీరక మార్పులు కూడా రావడంతో తాను తల్లి కాబోతుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే మెగా అభిమానులు ఈ విషయంపై ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ వార్త వైరల్ అయిన మరుక్షణమే వీరి ప్రేగ్నెన్సీకి సంబంధించిన మరో వార్త చక్కర్లు కొడుతుంది. కేవలం ఫేక్ ఫోటోతో ఉపాసన తల్లి కాబోతున్నట్టు వార్తలు సృష్టించారని తెలుస్తోంది. అయితే ఉపాసన తల్లి కాబోతుందని వస్తున్నటువంటి ఈ వార్తలు దేనికి సంకేతం? మెగా కోడలు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుందా అని సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.