రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్.సి 15 మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజు తాజాగా జి స్టూడియోస్ తో దాదాపు 350 కోట్ల రూపాయిల ఒప్పందం కుదుర్చుకొని ఈ మూవీ పూర్తి కాకముందే సేఫ్ అయిపోయారు.షూటింగ్ స్టేజిలో ఇంత బిజినెస్ చేసిన ఈ మూవీ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది.ఈ మూవీలో చరణ్ సరసన కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.గతంలో ఈ జంట వినయ విధేయ రామ మూవీలో కలిసి నటించారు.
మూవీస్ ను గ్రాండ్ గా చూపించడం కోసం నిర్మాతల చేత ముందు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టించే శంకర్ తాజాగా ఈ మూవీలోని ఓ సాంగ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 80 మంది ఫారిన్ డ్యాన్సర్ లను పిలిపించారు.ఈ సాంగ్ షూట్ కోసం చిత్ర యూనిట్ పది రోజుల షెడ్యూల్ కేటాయించిందని సమాచారం.