రాజమౌళితో ఆర్.ఆర్.ఆర్ మూవీ చేస్తున్న రామ్ చరణ్ పై ఇండియన్ సినీ రంగం కళ్ళు పడ్డాయి.అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి ప్రముఖ దర్శక – నిర్మాతలు క్యూ కడుతున్నారు.తాజాగా రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ అనంతరం ప్రముఖ దర్శకుడు శంకర్ తో ఒక మూవీ చేయనున్నారు.ఇందులో చరణ్ సరసన కియారా హీరోయిన్ గా నటిస్తుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
దాని ప్రకారం రామ్ చరణ్ శంకర్ తో చేస్తున్న మూవీ కోసం సుమారు 80 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్నారట.200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్సే సుమారు 100 కోట్లు అవుతుందని సమాచారం