గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు నిర్మాత క్లారిటీ ఇచ్చారు. కారణాలు ఏంటి అనేది బయటకి చెప్పలేదు కానీ గౌతమ్ ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఒక ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించే పనిలో పడ్డాడు. దీనికి సంబందించిన స్టోరీ లైన్ కూడా ఇప్పటికే ఒకే అయినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే గౌతమ్ తిన్ననూరి చెప్పిన కథని రామ్ చరణ్ రిజక్ట్ చేయడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి అనే మాట వినిపిస్తుంది. గౌతమ్ ఏకంగా 200 కోట్ల బడ్జెట్ తో ఫ్యూచర్ ఎలిమెంట్ తో సిద్ధం చేసుకున్న కథని నేరేట్ చేసాడని టాక్.
ఈ కథం 2050 బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందని తెలుస్తుంది. అంత అడ్వాన్స్ లెవల్ స్టోరీని డీల్ చేయాలంటే చాలా పకడ్బందీగా తెరకెక్కించాలని మెగాస్టార్ చెర్రీకి సూచించినట్లు బోగట్టా. కెరియర్ లో మంచి స్పీడ్ మీద ఉన్నప్పుడు ఎలాంటి ప్రయోగాత్మక కథల జోలికి వెళ్లకుండా మాస్ ఎంటెర్టైనెర్స్ పై దృష్టిపెట్టడం బెటర్ అని సలహా ఇచ్చినట్లు టాక్. అదే సమయంలో ఇప్పటి వరకు రెండు ప్రేమ కథలని మాత్రమే గౌతమ్ డీల్ చేశాడు.
అలాంటిది ఇంత భారీ కాన్వాయ్ పై తెరకెక్కించాల్సిన సినిమాని ఆవిష్కరించడం కష్టమనే అభిప్రాయం కూడా వ్యక్తం చేసినట్లు టాక్. ఈ నేపధ్యంలో చరణ్ కూడా రిస్క్ చేయడం ఎందుకని ఈ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక గౌతమ్ కి కూడా ఆ సినిమా కథపై భారీ బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు ఎవరూ ముందుకి రాకపోవడంతో విజయ్ దేవరకొండతో ప్రేమకథని సెట్ చేసుకొని సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లోనే మినిమమ్ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు సిద్ధం అయ్యాడు.