మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇక సోషల్ ఎలిమెంట్ తో సరికొత్తగా ఈ చిత్రాన్ని శంకర్ తెరపై ఆవిష్కరిస్తున్నారు. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఎస్.జె సూర్య విలన్ గా అలరించబోతున్నాడు. పాన్ ఇండియాలో ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది.
నెక్స్ట్ సినిమా కథలు కూడా యూనివర్శల్ అప్పీల్ తో పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండేలా రామ్ చరణ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో కన్నడ దర్శకుడు నర్తన్ చెప్పిన ఒక పవర్ ఫుల్ యాక్షన్ కథకి చెర్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే మాట వినిపిస్తుంది. దీంతో పాటు ఇప్పుడు మరో హాట్ టాపిక్ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్స్ జాబితాలోకి వేణు శ్రీరామ్ చేరిపోయారు. ఇక దిల్ రాజు అల్లు అర్జున్ తో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమాని ఎనౌన్స్ చేశారు. అయితే బన్నీ బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ని వెనక్కి నెట్టేశాడు.
ఈ నేపధ్యంలో దిల్ రాజు వకీల్ సాబ్ కోసం వేణు శ్రీరామ్ ని దర్శకుడుగా తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ ఐకాన్ మూవీ రామ్ చరణ్ చేతుల్లోకి వెళ్లినట్లు బోగట్టా. బన్నీ సినిమా ఆలస్యం చేయడంతో పాటు కొన్ని మార్పులు సూచించడం జరిగిందని సమాచారం. ఈ నేపధ్యంలో అదే కథని వేణు శ్రీ రామ్ చెర్రీకి చెప్పి ఒప్పించినట్లు తెలుస్తుంది. ఇక చెర్రీ ఒప్పుకోవడంతో శంకర్ సినిమా కంప్లీట్ కాగానే దిల్ రాజు ఆ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నట్లు టాక్. మరో వైపు వేణు శ్రీ రామ్ నేచురల్ స్టార్ నానితో ఒక సినిమా ప్లాన్ చేసుకున్నాడనే మాట వినిపిస్తుంది. మరి ఈ రెండింటిలో ఏది ముందు ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.