Ram Charan: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో ఈయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఈ సినిమా అనంతరం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ తన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.
రాజమౌళి సినిమా అనంతరం రామ్ చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా RC15 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది. ఇకపోతే ఈ సినిమా అనంతరం రామ్ చరణ్ మరో కన్నడ దర్శకుడుతో సినిమా చేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నర్తన్ అనే డైరెక్టర్ తో తన తదుపరిచిత్రం చేసే ఆలోచనలు రామ్ చరణ్ ఉన్నట్టు సమాచారం.
కన్నడలో నర్తన్ ‘ముఫ్తీ’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా ద్వారా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అదే జోష్ లో నర్తన్ నేవీ బ్యాక్ డ్రాప్ లో మరొక కథను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ కథతో ఈయన కన్నడ నటుడు యశ్ ను సంప్రదించగా కథ విన్న యశ్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారని తెలుస్తుంది. ఇలా ఈయన ఈ కథ రిజెక్ట్ చేయడంతో డైరెక్టర్ నర్తన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి ఈ కథ వినిపించడంతో ఈయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
Ram Charan: మెగాస్టార్ కి కథ వినిపించిన నర్తన్
ఈ సినిమా కథను రామ్ చరణ్ కన్నా ముందుగా నర్తన్ మెగాస్టార్ చిరంజీవికి పూర్తి కథను వివరించగా చిరంజీవి ఈ సినిమా కథకు గురించి అనంతరం రామ్ చరణ్ కథ విన్నారని, కథ అద్భుతంగా ఉండడంతో ఈ సినిమా చేయటానికి రామ్ చరణ్ సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. ఇక రాంచరణ్ తన 16 వ చిత్రాన్ని కన్నడ దర్శకుడుతో చేయబోతున్నట్లు తెలుస్తోంది.