Ram Charan: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం శంకర్ దర్శకత్వంలో రూపొందుతోంది. దర్శకుడు శంకర్ గురించి మనకు తెలిసిందే. సమాజంలో జరుగుతున్న విషయాల పైన అవగాహన కలిగించేలా శంకర్ సినిమాలు ఉంటాయి. ఇక కథానాయకుడిని ప్రత్యేకంగా చూపెట్టడంలో దర్శకుడు శంకర్ తన మార్క్ ని చూపిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా తాను దర్శకత్వం వహించిన ప్రతి సినిమా ఎంతో వైవిధ్యంగా ఉంటుందని ఇప్పటికే నిరూపితమైంది. ఇలా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రతేకంగా చెప్పాలా.
ఇక ఈ సినిమా షూటింగ్ కూడా కొనసాగుతూనే ఉంది. ఇక ఈ సినిమాని కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో ఉండబోతుందని సినీ వర్గాల సమాచారం. ఇక వీరిద్దరూ మొదటి సారి కలిసి పని చేయబోతున్నారు. మొత్తంగా 3 భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే షూటింగ్ పనులు మాత్రం చాలా నెమ్మదిగా కొనసాగుతుంది. ఎందుకంటే దర్శకుడు శంకర్ రామ్ చరణ్ మూవీనే కాకుండా ఇండియన్ 2 సినిమాకి కూడా పని చేస్తున్నాడు. ఇలా ఆ సినిమాకి 10 రోజులు ఈ సినిమాకి 10 రోజులు అన్నట్టుగా నడుస్తోంది.
ఇలా షూటింగ్ పనులు నెమ్మదిగా కొనసాగుతుండడంతో రామ్ చరణ్ సినిమాకి లీకుల పర్వం కొనసాగుతుంది. ఎంత జాగ్రత్త పడ్డా సోషల్ మీడియా లో సినిమాకి సంబంధించిన ఫోటోలు విడుదలవుతున్నాయి. ఇలా జరగడం వల్ల సినిమాపై హైప్ తగ్గుతుందని రామ్ చరణ్ అభిమానుల ఆవేదన. ఇలా సినిమాకి సంబంధించిన ఫోటోలు బయటికి వస్తున్నా దిల్ రాజు మాత్రం ఏం పట్టనట్టుగా ఉంటున్నాడని అభిమానులు దిల్ రాజు పై కొంచం అసంతృప్తితో ఉన్నారట.
Ram Charan:
అయితే ఇదంతా ఎలా ఉన్నా అప్డేట్స్ అయితే బయటికి రావడంతో కొంత మంది అప్పుడే వాళ్ళ వేషధారణను చూసి క్యారెక్టర్స్ ని ఊహించేసుకుంటున్నారు. ఈ మధ్యలోనే రామ్ చరణ్ మరియు అంజలి కి సంబదించిన ఫోటోలు బయటికి వచ్చాయి. అయితే ఈ సినిమాలో అంజలి రామ్ చరణ్ కి తల్లిగా నటించబోతుందని ఊహాగానాలు మొదలెట్టేసారు. ఏది ఏమైనా లీకుల విషయంలో దిల్ రాజు జాగ్రత్తలు తేసుకోవాలని సూచిస్తున్నారు.