మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. రంపచోడవరం ఫారెస్ట్ లో ఈ మూవీకి సంబందించిన కీలక సన్నివేశాలని షూట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒక క్యారెక్టర్ ప్రెజెంట్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. మరొక పాత్ర ఓల్డ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. కథని బట్టి చూస్తూ ఉంటే రామ్ చరణ్ తండ్రికొడుకులుగా మూవీలో నటించబోతున్నారని తెలుస్తుంది. ఓల్డ్ రామ్ చరణ్ క్యారెక్టర్ కి జోడీగా అంజలి ఈ మూవీలో నటిస్తుంది.
ప్రస్తుతం షూటింగ్ లో ఆమె కూడా పార్టిసిపేట్ చేసింది. ఇక తాజాగా ఈ మూవీకి సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పాతకాలం గెటప్స్ తో రామ్ చరణ్, అంజలి కలిసి తీసుకున్నట్లు ఉన్న ఫోటోలు సెట్స్ నుంచి లీక్ అయ్యాయి. మన ఇళ్లల్లో 90వ దశకంలో కెమెరాలు అప్పుడప్పుడే పల్లెటూళ్ళలోకి వచ్చే సమయంలో ఫోటోలు తీసుకొని వాటిని ఫ్రేమ్స్ కట్టించుకుని వారు. అలాగే రామ్ చరణ్, అంజలి వారి కొడుకుతో కలిసి తీసుకున్న ఫోటోగా సినిమాలో కాన్సెప్ట్ బేస్ లుక్స్ తో కనిపించారు.
రామ్ చరణ్ కూడా వైట్ బనియన్, లుంగీతో సైకిల్ తొక్కుతూ కనిపిస్తున్న స్టిల్స్ బాగా వైరల్ అయ్యాయి. ఈ నేపధ్యంలో రెండు భిన్నమైన కాలాల నేపధ్యంలో ఈ సినిమా కాన్సెప్ట్ ఉంటుందని తెలుస్తుంది. మరి శంకర్ మొట్టమొదటి తెలుగు సినిమాని రామ్ చరణ్ తో ఏ విధంగా తెరకెక్కిస్తున్నాడు అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. ఓ వైపు ఇండియన్ 2 మూవీని కూడా శంకర్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇలా రెండు సినిమాలు గ్యాప్ తీసుకుంటే ఒకే సమయంలో చేయడం శంకర్ హిస్టరీలో మొదటి సారి.