Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ ప్రస్తుతం తాను చేసే సినిమాలన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.
వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఇండియన్ క్రికెటర్లను తన ఇంటికి ఆహ్వానించి పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే క్రికెటర్ హార్దిక్ పాండే తో పాటు ఇతర క్రికెటర్లు రామ్ చరణ్ ఇంట్లో సందడి చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ ఎంత ఉత్కంఠం భరితంగా కొనసాగింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది.
Ram Charan: హార్దిక్ పాండేకి పార్టీ ఇచ్చిన చరణ్…
ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ గెలిచిన అనంతరం హార్దిక్ పాండే రామ్ చరణ్ ఇంట్లో సందడి చేశారు. ఈ క్రమంలోని ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే RRR సినిమా తర్వాత ఈయన తన తండ్రితో కలిసి ఆచార్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC 15 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాను దిల్ రాజు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.