Ram Charan : ఈమధ్య సోషల్ మీడియా పుణ్యమా హీరో, హీరోయిన్ల క్యూట్ మూమెంట్స్ ను ఫాన్స్ ఇట్టే ఫాలో అయిపోతున్నారు. ఫాన్స్ ను ఇంప్రెస్స్ చేసేందుకు స్టార్ హీరోలు సైతం తమ పర్సనల్ విషయాలను, ప్రొఫెషనల్ అప్డేట్స్ ను షేర్ చేసుకుంటున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన క్యాండిడ్ ట్ ఫోటోలను ఇంన్ స్టాగ్రామ్ , ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ పిక్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ ని మించిన స్టైలిష్ లుక్స్ ను చరణ్ ఫాలో అవుతున్నారని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Ram Charan : రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటారు. రీసెంట్ గా ఓ షూట్ కోసం మేక్ ఓవర్ అవుతున్న రామ్ తన సైడ్ లుక్స్ పిక్స్ ను పోస్ట్ చేశారు. ట్రెండీ హెయిర్ స్టైల్ వేసుకొని స్మూత్ బియర్డ్ తో , కళ్ళకు స్టైలిష్ కళ్ళజోడు పెట్టుకుని తన ముఖాన్ని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతున్న పిక్ అమ్మాయిల మనసును దోచేస్తోంది. మరో ఫోటోలో కేవలం తన ముఖం అద్దంలో రిఫ్లెక్ట్ అయ్యేలా ఉంది. ఈ పిక్ లోనూ క్యూట్ స్మైల్స్ విసురుతున్నాడు రామ్.

షూటింగ్ టైం లో పాపం బోర్ కొట్టిందో ఏమో ఇలా వరుస పెట్టి క్యాండిడ్ పిక్స్ ను దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరినీ అలరిస్తున్నాడు ఈ మెగా పవర్ స్టార్. ఈ మధ్యన మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారు. కోడలు ఉపాసన కూడా యోగా మంత్రాలతో ఫిట్నెస్ ట్రిప్స్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సెలబ్రిటీ కపుల్స్ ఈ మధ్యనే ఎయిర్ పోర్ట్ లో ట్రాలీ మీద కూర్చుని చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. చిన్న పిల్లల్లా వారు ఎంజాయ్ చేసిన తీరు అందరిని ఆకట్టుకుంది. వీరు ఇలా కూడా ఉంటారా అని ఆశ్చర్య పోయారు ఫాన్స్.

ఆర్ఆర్ఆర్ బంపర్ హిట్ తో పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు రామ్ చరణ్. లేటెస్ట్ గా డైరెక్టర్ శంకర్ తో ఆర్సి15 షూటింగ్ లో పాల్గొంటూ బిజీబిజీగా ఉన్నాడు. జెర్సీ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో కూడా ఒక మూవీ సైన్ చేశారు. ఇలా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే మరోవైపు తన ఫ్యాన్స్ ను ఇలా హాండ్సమ్ ఫోటోలతో ఇంప్రెస్ చేస్తున్నారు.