Ram Charan : ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో నెక్ట్స్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో చెర్రీ ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మరోవైపు తన తండ్రి చిరంజీవితో చేసిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయినా.. చెర్రీకి పెద్దగా తలెత్తిన ఇబ్బందైతే ఏమీ లేదు. 2022లో రామ్ చరణ్ .. ఆర్ఆర్ఆర్‌తో ఒక బ్లాక్ బస్టర్ అందుకుంటే.. ఆచార్య మూవీతో డిజాస్టర్ అందుకున్నారు. ఈ రెండు చిత్రాలు మల్టీస్టారర్ మూవీస్ కావడం విశేషం. ఆ తర్వాత రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా.
రామ్ చరణ్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలే రామ్ చరణ్ శంకర్ సినిమాలో మూడు, నాలుగు గెటప్స్‌లో కనిపించనున్నాడనే టాక్ నడుస్తోంది. దీనికి తగ్గట్టుగా చెర్రీ కూడా ఇటీవలి కాలంలో రకరకాల గెటప్పుల్లో కనిపిస్తున్నాడు. ఒక్కోసారి కాలేజ్ కుర్రాడిలా కనిపిస్తున్నాడు. ఇంకొన్ని సార్లు కాస్త పెద్దరికంగా కనిపిస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే ప్రస్తుతం నడుస్తున్న టాక్ నిజమేననిపిస్తోంది. తాజాగా రామ్ చరణ్ ఏదో షూటింగ్ కోసం రెడీ అయినట్టు కనిపిస్తోంది.
Ram Charan : శంకర్ సినిమా షూటింగ్ కోసమా? లేదంటే ఏదైనా యాడ్ షూటింగ్ కోసమా?
సదరు సినిమాకు సంబంధించిన మేకోవర్, వర్కింగ్ స్టిల్స్‌ను రామ్ చరణ్ షేర్ చేశాడు. అద్దంలో రామ్ చరణ్ చూసుకుంటున్నాడు. అయితే వర్క్ మోడ్ అంటూ రామ్ చరణ్ షేర్ చేసిన ఈ ఫోటోలతో ఫ్యాన్స్‌కి ఓ విషయం అర్థం కావడం లేదు. అది శంకర్ సినిమా షూటింగ్ కోసమా? లేదంటే ఏదైనా యాడ్ షూటింగ్ కోసమా? అనేది తెలియక అభిమానులు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ పిక్స్ మీద ఉపాసన స్పందించింది. ఓ బేబీ అంటూ.. హార్ట్ సింబల్‌ను షేర్ చేసింది. మొత్తానికి రామ్ చరణ్ ఫోటోలు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. స్టైలిష్ లుక్‌లో తమ అభిమాన హీరోను చూసిన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నెటిజన్లు పాజిటివ్ కామెంట్లతో దుమ్ములేపేస్తున్నారు.