ఇండస్ట్రీలో అందరితో సఖ్యతగా ఉండే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి ఆర్.ఆర్.ఆర్ మూవీ చేశారు.ఈ మూవీకి సంబంధించి జరుగుతున్న ప్రమోషన్స్ లో బ్యాక్ టు బ్యాక్ పాల్గొంటున్న రామ్ చరణ్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంత గురించి యాంకర్ అడగగా కం బ్యాక్ బిగ్గర్ స్ట్రాంగర్ అంటూ కామెంట్ చేశాడు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది.తాజాగా దీనిపై స్పందించిన సమంత ఈ వీడియోను ట్వీట్ చేసింది.సమంత,చరణ్ గతంలో రంగస్థలం మూవీలో కలిసి నటించారు.పైగా సమంత రామ్ చరణ్ భార్య ఉపాసనకు మంచి ఫ్రెండ్ ఇలాంటి నేపథ్యంలో చరణ్ చేసిన వ్యాఖ్యలు విశేషత సంతరించుకున్నాయి.