మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇక ఈ మూవీలో కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమాపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒకే చెప్పిన అది కాస్తా క్యాన్సిల్ అయ్యింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ 16వ చిత్రం అఫీషియల్ గా ఫైనల్ అయ్యింది. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటించబోతున్నాడు.
మైత్రీ మూవీ మేకర్స్ ఫైనాన్స్ చేసిన వెంకట సతీష్ కిలారు ఈ మూవీతో నిర్మాతగా మారుతున్నాడు. అలాగే సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ మూవీ నిర్మాణంలో భాగం అయ్యింది. నిజానికి బుచ్చిబాబు ఈ మూవీని తారక్ తో చేయాల్సి ఉంది. అతను ఒకే కూడా చెప్పాడు. అయితే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ కాకపోవడం నెక్స్ట్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ఉండటంతో ఈ మూవీ మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందని రామ్ చరణ్ కి కథని రివర్ చేయడం, బుచ్చిబాబు వెళ్లి చెర్రికి కథ చెప్పడం జరిగింది.
ఇక అతను ఒప్పుకోవడంతో అఫీషియల్ ఎనౌన్స్ అయ్యింది. ఇక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కబోతుందని తెలుస్తుంది. రామ్ చరణ్ ఈ మూవీలో కబడ్డీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. పాన్ ఇండియా లెవల్ లోనే ఈ మూవీని యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో బుచ్చిబాబు తెరకెక్కించబోతున్నాడు అని తెలుస్తుంది. ఇక ఈ మూవీ కోసం బాలీవుడ్ హీరోయిన్ పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్.