Ram Charan:ప్రముఖ యంగ్ హీరో రామ్ చరణ్ అంటే తెలియని వారుండరు. చరణ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2007లో విడుదలైన చిరుత సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.ఈ సినిమాలో తన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు.
రాజమౌళి దర్శకత్వం లో మగధీర సినిమా తీసాడు. అయితే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా సెన్సేషన్ సృష్టించింది. ఆ తర్వాత కొన్ని సినిమా లు పరాజయం అయిన కూడా సినిమా ఆఫర్ లు బాగానే వచ్చాయి. అయితే తాజాగా రాజమౌళి దర్శకత్వంలో మళ్లీ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించాడు.రామ్ చరణ్ కెరీర్ లో ఇది మొదట పాన్ ఇండియా సినిమా. ఈ సినిమాతో రామ్ చరణ్ బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో, సక్సెస్ మీట్ లో ఎక్కువగా మీడియాలో కనిపించేవాడు. పెద్దగా ఏ ప్రోగ్రాం లలో కనిపించని రామ్ చరణ్ ఎప్పుడో ఒకసారైనా బయట కనిపించేవాడు. కానీ ఆచార్య సినిమా ఫ్లాప్ అయిపోయిన తర్వాత రామ్ చరణ్ అస్సలు బయటికి రావట్లేదని పుకార్లు వినిపిస్తున్నాయి. దర్శకుడు శంకర్ తో RC15 సినిమా షూటింగ్ కూడా లేకున్నా రాంచరణ్ బయటికి రాకపోవడానికి కారణమేంటి.
లూసిఫర్ సినిమా హక్కులను స్వయంగా రామ్ చరణ్ కొనుగోలు చేసి మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చాడు. కనీసం గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ లో కూడా రామ్ చరణ్ రాలేదు. కనీసం రామ్ చరణ్ గాడ్ ఫాదర్ సినిమాను ప్రమోట్ చేయడానికి ఏదైనా ఒక ఇంటర్వ్యూ చేస్తాడని మెగా అభిమానులు ఆశపడ్డారు. కానీ మెగా పవర్ స్టార్ మాత్రం అలాంటివి చేయకుండా ఉండడంతో మెగా అభిమానులు ఆందోళన పడుతున్నారు.
Ram Charan: రామ్ చరణ్ బయటికి రాకపోవడానికి బలమైన కారణం ఉందా..
రామ్ చరణ్ మాత్రం చాలా సినిమా ప్రాజెక్టులపై సంతకాలు చేస్తు బిజీగా ఉన్నాడు. ఈ కొత్త సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండడంవల్ల ఇతర ప్రాజెక్టులకు సమయాన్ని కేటాయించలేకపోతున్నాడని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఎంత బిజీగా ఉన్నా గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్ కి రాకపోవడం ఏంటి అని అభిమానులు అనుకుంటున్నారు. ఏదో బలమైన కారణం ఉండడం వల్ల ఈ మెగా హీరో బయటకి రాలేకపోతున్నాడని పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.