టాలీవుడ్ యువ హీరోల్లో ఎనర్జిటిక్ స్టార్..ఉస్తాద్ రామ్ పోతినేని ఒకరు. సినిమాల విషయంలో ఆయన ఇప్పుడు స్పీడు పెంచారు. గత ఏడాది ది వారియర్ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో చేసి ఒకేసారి రిలీజ్ చేశారు రామ్ పోతినేని. అయితే ఇప్పుడు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తోన్నిసినిమాతో పాన్ ఇండియా ఇమేజ్, మార్కెట్ క్రియేట్ చేసుకోవటానికి రంగంలోకి దిగారు.

రామ్ పోతినేని :
ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 20న రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్‌ను బోయపాటి శ్రీను పొట్రేట్ చేస్తున్న తీరుపై రామ్ ఫ్యాన్స్ ఖుషిగా ఉన్నారు. ఎగ్జయిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ ఎగ్జయిట్‌మెంట్‌ను పెంచుతూ మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అనౌన్స్‌మెంట్ చేశారు.
అదేంటో తెలుసా!… ఈ సినిమాను దసరా పండుగకు కాకుండా ఇంకా ముందుగానే విడుదల చేయటానికి నిర్ణయించుకున్నారు. అదెప్పుడో తెలుసా! సెప్టెంబర్ 15.శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో యువ నటి శ్రీలీల కథానాయిక. థమన్ సంగీత స్వరకర్త. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో భారీ పాన్-ఇండియన్ విడుదల కానుంది.