Rakul Preeth Singh: టాలీవుడ్ సిని ప్రేక్షకులకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తూ దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే. మొదట కెరటం సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో ఊహించని విధంగా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు అని చెప్పవచ్చు.
ఈమె తెలుగులో సరైనోడు, జయ జానకి నాయక, ధ్రువ, నాన్నకు ప్రేమతో, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, లౌక్యం, పండగ చేసుకో, బ్రూస్ లీ, కరెంట్ తీగ ఇలా ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ జాకీ బగ్నాని తో ప్రేమలో మునిగి తిరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోంది అంటూ ఈ మధ్యనే రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు సోషల్ మీడియా వేదిక ప్రకటించాడు.
ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె చీరకట్టులో అందాలను ఆరబోస్తూ యువతకు పిచ్చెక్కిస్తోంది. అంతే కాకుండా తన పైట కొంగును పక్కకు జరిపి మరీ తన ఎద అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.