Rakul Preeth Singh : రకుల్ ప్రీత్ సింగ్ క్లాసీ లుక్స్ తో కవ్విస్తోంది. ఈ జిమ్ బ్యూటీ తాను ఎంచుకున్న ప్రతి దుస్తులకు తన వ్యక్తిగత టచ్ జోడిస్తుంది. ఆమె ఎత్నిక్ వార్డ్ రోబ్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఆమె పాశ్చాత్య ఎంపికలు అదిరిపోతాయి. తాజాగా ఇండియా న్యూస్ మంచ్ కోసం క్లాతింగ్ లేబుల్ సీలవర్ స్టూడియో నుండి రంగురంగుల ప్యాంట్‌సూట్‌ను అలంకరించుకుని , రకుల్ అద్భుతమైన లుక్స్ తో అందరిని అట్రాక్టు చేసింది. ఆరెంజ్, బ్లూ, పింక్, బ్రౌన్ తో పాటు మరిన్ని రంగులలో అబ్‌స్ట్రాక్ట్ ప్రింట్‌లతో కూడిన చమత్కారమైన డ్రెస్ లో క్రేజీగా కనిపించింది రకుల్.

Rakul Preeth Singh : బటన్-డౌన్ వివరాలతో కూడిన ఫుల్ స్లీవ్స్ తో డిజైన్ చేసిన భారీ బ్లేజర్ వేసుకుని రకుల్ దానికి జతగా వైడ్-లెగ్ ప్యాంట్ వేసుకుంది . ఆమె బ్లేజర్ క్రింద తెల్లటి కార్సెట్ టాప్ ధరించింది. రాయల్ బ్లూ పాయింటెడ్ హీల్స్‌తో లుక్‌ను పూర్తి చేసింది.

అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా సింపుల్ అలంకరణను ఎంచుకుంది. ఆమె తన చెవులకు సిల్వర్ హోప్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. తన స్టైలిష్ లుక్స్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేసింది.

ఈ మధ్యనే జరిగిన GQ మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్ 2022కి భారీ ప్యాంట్‌సూట్‌లో హాజరయ్యి ఈ దివా అద్భుతంగా కనిపించింది. సొగసైన వెండి వివరాలతో వచ్చిన పిన్‌స్ట్రిప్డ్ డార్క్ బ్లూ ప్యాంట్‌సూట్‌ను ధరించి అందరి చూపులను తన వైపుకు తిప్పుకుంది.

కాలర్డ్ నెక్‌లైన్, బటన్-డౌన్ వివరాలను కలిగిన లూజ్ బ్లేజర్ వేసుకుని ఆమె వైడ్ లెగ్ ప్యాంట్‌తో జతకట్టింది. రకుల్ స్టేట్‌మెంట్ గోల్డ్ రింగులు, చెవులకు ఒక జత ఇయర్ రింగ్స్ ను అలంకరించుకుంది. ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా ఆమె ఒక జత బ్లాక్ హీల్స్‌తో తన రూపాన్ని పూర్తి చేసింది. రకుల్ స్మోకీ ఐ లుక్, సింపుల్ మేకప్ తో ఆమె ఫార్మల్ వస్త్రధారణతో పర్ఫెక్ట్ గా కనిపించింది.
