Rakul Preet Singh : టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ హల్ చల్ చేస్తోంది. ఓటీటీ వేదికగా విడుదల అవుతున్న ఈ భామ నటించిన సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇన్నాళ్లు బేబీ డాల్ గా, గ్లామర్ క్వీన్ గా తెరముందు కనిపించిన రకులు త్వరలో బాలీవుడ్ లో రిలీజ్ కాబోతున్న ఛత్రివాలి సినిమాతో సోషల్ మెసేజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. జనవరి 20న జీ5లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను రకుల్ గత కొన్ని రోజులుగా చేస్తోంది. సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లు చేస్తూ ఫ్యాషన్ తో మూవీ ప్రమోషన్ చేస్తోంది. తాజాగా ఈ చిన్నది గ్రీన్ కలర్ అవుట్‌ఫిట్ వేసుకుని కుర్రాళ్ల దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది. ప్రస్తుతం రకుల్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచేస్తున్నారు.

తెలుగు చిత్రాలలో పెద్దగా తెరపై కనిపించనకపోయినప్పటికీ, రకుల్ క్రమం తప్పకుండా సోషల్ మీడియాలో చిత్రాలను పోస్ట్ చేస్తూ తన అభిమానులకు కనెక్ట్ అవుతుంది. తాజాగా ఈ బ్యూటీ ఆకుపచ్చ రంగు కో ఆర్డ్ సెట్ ధరించి తన ప్రతి కోణాన్ని అందంగా చూపిస్తూ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఈ అవుట్‌ఫిట్ లో ఎంతో హాట్‌గా కనిపించింది రకుల్. డీప్ నెక్‌లైన్ కలిగిన బ్రాలెట్ వేసుకుని దానికి జోడీగా బాందిని డిజైన్స్ తో వచ్చిన లూజ్ ప్యాంట్‌ను ధరించింది.

ఈ అవుట్‌ఫిట్‌కు సాసీ లుక్ వచ్చేందుకు డార్క్ గ్రీన్ కలర్ జాకెట్‌ను బ్రాలెట్ మీదుగా వేసుకుంది. చెవులకు భారీ జుంకాలు, చేతికి డిజైనర్ బ్రేస్‌లెట్ , ఉంగరాలు పెట్టుకుని తన కలర్ ఫుల్ లుక్ తో సోషల్ మీడియాలో అదరగొట్టింది. కనులకు గాగుల్స్ పెట్టుకుని కురులను లూజ్ గా వదులుకుని కెమెరాకు పోజులు ఇచ్చి కుర్రాళ్లకు పిచ్చెక్కించింది.

ఈ కొత్త సంవత్సరంలో తన మొదటి సినిమా ఛత్రివాలితో సురక్షితమైన సెక్స్ గురించి యువ తరానికి అవగాహన కల్పించే బాధ్యత కలిగిన పాత్రను పోషించి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. ఈ మధ్యనే విడుదలైన ట్రైలర్ రకుల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రకుల్ ఈ మూవీలో ముక్కుసూటి అమ్మాయిగా కనిపించనుంది.

తేజస్ ప్రభ విజయ్ దియోస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హర్యానాలో చిత్రీకరించారు. సన్యా పాత్రలో నటించిన రకుల్ అందరికి నచ్చుతుందని డైరెక్టర్ తెలిపారు. రకుల్ చివరిసారిగా డాక్టర్ జి చిత్రంలో గైనకాలజిస్ట్‌గా నటించింది.

మగ గర్భనిరోధకాలు , సురక్షితమైన సెక్స్ యొక్క ప్రాముఖ్యత గురించి సందేశాన్ని ప్రతి ఇంటికి అందించడమే ఛత్రివాలి సినిమా లక్ష్యం అని రకుల్ ప్రమోషన్ ఈవెంట్‌లలో తెలిపింది. భారతదేశ జనాభాలో ఎక్కువ మంది యువత ఉన్నారు, వారికి సెక్స్ ఎడ్యుకేషన్‌పై అవగాహన కల్పించడం అవసరం అని రకుల్ తెలిపింది.

Advertisement