Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ రోజు రోజుకు తన ఫ్యాషన్ స్టైల్స్ తో అందరిని ఇంప్రెస్ చేస్తోంది. లేటెస్ట్ అప్డేటెడ్ అవుట్ ఫిట్స్ ను ధరించి ఫ్యాషన్ ప్రియులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఫ్యాషన్ తో ఎప్పుడు ప్రయోగాలు చేసేందుకు సై అంటుంది ఈ చిన్నది. అందుకు తగ్గట్లుగానే ఆమె ఫోటోషూట్ లు ఉంటాయి. మోడరన్ డ్రెస్ అయినా, ట్రెడిషనల్ అవుట్ ఫిట్ అయినా ఒకసారి ఈ చిన్నది వేసుకుంటే ఆ దుస్తులకే వన్నె వస్తుందంటారు రకుల్ ఫ్యాన్స్. తాజాగా రకుల్ వేసుకున్న లెహంగా ఫ్యాషన్ ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటుంది.

Rakul Preet Singh : ఓ ఫోటో షూట్ కోసం ఈ బ్యూటీ ప్యాచ్ వర్క్ హ్యాండ్ పెయింట్స్ తో డిజైన్ చేసిన లెహంగా ను వేసుకుంది. బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ డిజైనర్ పీస్ ను ఫ్యాషన్ డిజైనర్ అనామికా ఖన్నా ఫ్యాషన్ లేబుల్ నుంచి సేకరించింది రకుల్. ఈ డిజైనర్ స్కర్ట్ కు జోడిగా షార్ట్ స్లీవ్స్ తో వచ్చిన బ్లాక్ టీ షర్ట్ ని వేసుకుని అదరగొట్టింది రకుల్ ప్రీత్. ఈ మోడ్రన్ లెహంగా సెట్ లో రకుల్ సరికొత్త ఫ్యాషన్ ను పరిచయం చేసింది.

ఈ ట్రెండీ లెహంగా సెట్ కు మ్యాచ్ అయ్యే విధంగా జ్యువలరీ ని ఎన్నుకుంది బ్యూటీ. చేతికి గ్రే కలర్ లో వచ్చిన బ్యాంగిల్స్ ని వేసుకుంది, చెవులకు ముత్యాలతో డిజైన్ చేసిన భారీ ఇయర్ రింగ్స్ ని పెట్టుకుని గ్లామర్ లుక్స్ తో యూత్ కి పిచ్చెక్కించింది.

రీసెంట్ గా రకుల్ గ్రీన్ కలర్ ఫ్లోరల్ డిజైన్ తో వచ్చిన లెహంగా సెట్ వేసుకుని ఫెస్టివ్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేసింది. డిజైనర్ సనా భరిజా ఫ్యాషన్ లేబుల్ నుంచి నస్రీన్ కలెక్షన్స్ నుంచి ఈ అందమైన లెహంగాను ఎన్నుకుంది రకుల్.

బీడ్ వర్క్ హెల్ప్ లైన్ తో వచ్చిన లెహంగా స్కర్ట్ కి జోడిగా ప్లంగింగ్ నెక్ లైన్ కట్ అవుట్ డీటెయిల్స్ తో వచ్చిన బ్లౌజ్ ని ధరించింది. అదే ప్యాట్రన్స్ తో ఉన్న దుపట్టాను వేసుకుని అదరగొట్టింది రకుల్. మెడలో సింపుల్ గా చోకర్ నెక్లెస్ పెట్టుకొని మెరిసిపోయింది.
