Rakul Preet Singh : స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన మాల్దీవుల పర్యటన నుండి మరిన్ని అద్భుతమైన చిత్రాలను ఫ్యాన్స్ తో పంచుకుంది. ఐ ల్యాండ్ బేబీ అవతారమెత్తిన రకుల్ చాక్లెట్ బ్రౌన్ షేడ్ బికినీ టాప్ , తొడ చీలిక తో ఉన్న లూజు కుర్తాను ధరించి మాల్దీవుల్లో హాట్ ఫోటో షూట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయ్.

Rakul Preet Singh : గత నెల రోజులుగా పండుగల సీజన్ కావడంతో బాలీవుడ్ తారలంతా పార్టీ లని ఫంక్షన్ లని , డిన్నర్ లని బిజీ బిజీ గా గడిపారు. ఇప్పుడిప్పుడే అందరూ ఆ మూడ్ నుంచి బయటకి వస్తున్నారు. ఇదే సమయంలో, నటి రకుల్ ప్రీత్ సింగ్ తనను తాను డిటాక్స్ చేసుకోవడానికి సరైన మార్గాన్ని ఎన్నుకుంది. సెలవు కోసం మాల్దీవులకు చెక్కేసింది. ఈ ద్వీప దేశం నుండి అందమైన స్నిప్పెట్స్ ను రకుల్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది.

పూల్ లో ఛిల్ల్ అవుతూ , సన్ సెట్ ను ఎంజాయ్ చేస్తూ . రుచికరమైన ఆహారాన్ని తింటూ , నైట్ షోస్ చూస్తూ ఫుల్ లెన్త్ లో బీచ్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా రకుల్ అద్భుతమైన బ్రౌన్ కలర్ డ్రెస్ , దానికి మ్యాచ్ అయ్యే బికినీ టాప్ వేసుకుని కుర్రాళ్లను హాట్ పోజులతో రెచ్చగొట్టింది. స్టేట్మెంట్ ఆక్సేసరీస్ ను ఎన్నుకుని బీచ్ వెకేషన్ ఫాషన్ ను ప్రమోట్ చేస్తోంది.

మాల్దీవ్స్ బీచ్ లో రిలాక్స్ అవుతూ ఈ అవుట్ ఫిట్ తో దిగిన పిక్స్ ను రకుల్ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు అందమైన కాప్షన్ ను జోడించింది. ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయ్. అమ్మడి హాట్ లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

డీప్ వీ నెక్ లైన్ , ప్లీటెడ్ డిటైల్స్ , స్ట్రాప్స్ తో వచ్చిన బికినీ టాప్ వేసుకుని, ప్లంగింగ్ వీ నెక్ లైన్ , ప్లీటెడ్ డిటైల్స్ తో బికినీ టాప్ కనిపించేలా ఫుల్ స్లీవ్స్ తో వచ్చిన లాంగ్ డ్రెస్ ను ధరించి సరికొత్త ఫ్యాషన్ ను పరిచయం చేసింది. తల మీద క్యాప్, ముఖానికి కళ్ళజోడు, మేడలో పొడవాటి చైన్, చేతివేళ్లకు స్టేట్మెంట్ ఉంగరాలు పెట్టుకుని అదరగొట్టింది.
