Rakul Preet Singh : టాలీవుడ్ లో స్టార్డమ్ ను సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో సందడి చేస్తోంది. ఓ వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఫ్యాషన్ స్టైల్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటున్న ఈ భామ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ ఫాన్స్ ఫాలోయింగ్ ని రోజురోజుకు పెంచుకుంటుంది. తాజాగా తెల్లని చీర కట్టుకొని కుర్రాళ్ళ చూపులు తల వైపుకు తిప్పుకుంటుంది.

Rakul Preet Singh : బికినీలతో మాల్దీవ్స్ లో స్టైలిష్ వెకేషన్స్ ఎంజాయ్ చేయాలన్నా, పండుగ వేళ ఫెస్టివ్ కలెక్షన్ లతో ఇంప్రెస్ చేయాలన్నా యోగ బ్యూటీ వెన్నతో పెట్టిన విద్య. ప్రతి అవుట్ ఫిట్ లో తనదైన స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ అలరిస్తుంటుంది రకుల్. తాజాగా జరిగిన అవార్డ్స్ ఫంక్షన్ కి ఈ బ్యూటీ వైట్ కలర్ శారీ కట్టుకుని అందరి అటెన్షన్ ను తనవైపుకు తిప్పుకుంది.

చిన్నచిన్న పూల అలంకరణలు, బీడ్ వర్క్ తో ట్రాన్స్పరెంట్ చీరలో దేవకన్యలా మెరిసింది రకుల్. ఈ చీరకు మ్యాచింగ్ గా స్వీట్ హార్ట్ నెక్ లైన్ త్రెడ్ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్ వేసుకుని తన అందాలతో మెస్మరైజ్ చేసింది.

చీరకు తగ్గట్లుగా చెవులకు స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ ను అలంకరించుకుంది. చేతి వేళ్లకు ఉంగరాలు పెట్టుకుంది. మినిమల్ మేకప్ తో పెదాలకు న్యూడ్ లిప్ కలర్ వేసుకుని తన కురులను లూస్ గా వదులుకొని గ్లామరస్ లుక్స్ తో కవ్వించింది.

ట్రెడిషనల్ లుక్ లోనే కాదు మోడరన్ అవుట్ ఫిట్ లోనూ యూత్ ను మంత్రముగ్ధులను చేయగలదు రకుల్ . రీసెంట్ గా ఓ ఫోటోషూట్ కోసం స్టూడియో మూన్ రే ఫ్యాషన్ లేబుల్ నుంచి స్టన్నింగ్ అవుట్ ఫిట్ ని ఎన్నుకొని అదరగొట్టింది. వైట్ కలర్ నెట్ టాప్ దానికి జోడిగా ఎల్లో కలర్ మిడి వేసుకుంది. బాస్ లేడీ లుక్ అందించేందుకు బ్లేజర్ ని ధరించింది.

ఈ పొట్టి డ్రెస్ లో తన థైస్ అందాలను చూపిస్తూ తన్మయంలో ముంచేసింది రకుల్. మీషో డిజైన్ నుంచి సెలెక్ట్ చేసిన హూప్ ఇయర్ రింగ్స్ ను చెవులకు పెట్టుకుంది. ఆలడో నుంచి స్టైలిష్ షూస్ ను సెలెక్ట్ చేసుకుంది.
