Rakul Preet Singh : పండుగల సీజన్ కావడంతో సోషల్ మీడియాలో ఎత్నిక్ అవుట్‌ఫిట్స్ సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్ గా అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ అద్భుతమైన అవుట్‌ఫిట్స్‌ను ఎన్నుకుని తన ఫ్యాషన్ గేమ్‌తో ఫ్యాషన్ ప్రియులను మెస్మరైజ్ చేస్తోంది. ఎత్నిక్ లుక్స్‌తో అందరి చూపును తనవైపు తిప్పుకుంటోంది. ఓ ఫోటో షూట్ కోసం రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా కు మ్యూస్‌గా వ్యవహరించింది . డిజైనర్ రూపొందించిన ఆకర్షణీయమైన పీచ్ కలర్ లెహెంగా సెట్ వేసుకుని అందరికి గుర్తుండిపోయే స్టైల్స్‌ను ప్రదర్శించింది.

Rakul Preet Singh : ఫ్యాషన్ ఇండస్ట్రీలో అద్భుతమైన ఎత్నిక్ వేర్స్ ను అందించడంలో ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా కు తిరుగులేదు. మనీష్ అందించే స్టైల్స్ బాలీవుడ్ స్టార్స్‌ను అమితంగా ఆకర్షిస్తుంటాయి. ఓ రకంగా బాలీవుడ్ స్టార్లకు మనీష్ ఫేవరేట్ డిజనర్‌గా మారిపోయారు. ఇప్పుడు రకుల్ కూడా మనీష్ ఫ్యాషన్ స్టైల్స్‌ను ఫాలో అయిపోతోంది . ఈ ఫోటో షూట్ కోసం గోల్డెన్ వర్క్‌తో డిజైన్ చేసిన లెహెంగా స్కర్ట్ వేసుకుని దానికి మ్యాచింగ్‌గా మిర్రర్ వర్క్‌తో డిజైన్ చేసిన స్ట్రాపీ బ్లౌజ్‌ను ధరించి కుర్రాళ్లను ఫిదా చేసింది. ఈ లెహెంగా స్కర్ట్, బ్లౌజ్‌కు జోడీగా అదే ప్యాట్రన్స్‌తో డిజైన్ చేసిన దుపట్టాను వేసుకుని తన అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

ఈ అవుట్‌ఫిట్‌కి తగ్గట్లుగా చెవులకు డ్యాంగ్లర్ ఇయర్ రింగ్స్ , చేతి వేళ్లకు ఉంగరాలను పెట్టుకుంది. ఐ బ్రోస్‌ను డార్క్ చేసుకుని కనులకు ఐలైనర్ , ఐ ష్యాడో, పెదాలకు కోరల్ లిప్ షేడ్ పెట్టుకుని మినిమల్ మేకప్‌తో మెస్మరైజ్ చేసింది రకుల్ . ఈ ఎత్నిక్ ఫోటో షూట్ పిక్స్‌ను రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఫాలోవర్స్‌ను ఫిదా చేసేసింది.

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటోంది రకుల్ ప్రీత్ సింగ్ . కొండ పొలం తరువాత తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ బాట పట్టింది ఈ బ్యూటీ. అక్కడ ఈ ఏడు థ్యాంక్ గాడ్, డాక్టర్ జి సినిమాల్లో నటించి అలరించింది ఈ బ్యూటీ.

ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో తన పర్సనల్ విషయాలను పంచుకుంటుంది. అంతే కాదు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకునేందుకు హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ అలరిస్తుంటుంది రకుల్. తాజాగా చేసిన ఫోటో షూట్ పిక్స్ కూడా ఫాలవోవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాయి.
