Rakul preet Singh : పండుగ ముందే దీపావళి సందడిని తీసుకొచ్చింది స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అందమైన ఎత్నిక్ వేర్ ధరించి కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతుంది. ఆకుపచ్చని రంగులో అందంగా డిజైన్ చేసిన చుడిదార్ ధరించి అద్భుతమైన ఫోటో షూట్ నిర్వహించి ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో ట్విట్టర్ అకౌంట్లో ఈ పిక్స్ ను పోస్ట్ చేసి ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్ లో వైరల్ అవుతున్నాయి.

Rakul preet Singh : సినిమాల్లో అద్భుతమైన నటనతో మెప్పించడం మాత్రమే కాదు , లేటెస్ట్ అప్డేటెడ్ ఫ్యాషన్ దుస్తులను ధరించి మంత్రముగ్ధులను చేయగలదు రకుల్ ప్రీత్ సింగ్. పార్టీవేర్ లుక్స్ నుంచి క్యాజువల్ వేర్ వరకు ప్రతి అవుట్ ఫిట్ లో సింపుల్ గా ఎంతో చార్మింగా కనిపిస్తుంది ఈ బ్యూటీ. తాజాగా ఓ ఫోటోషూట్ కోసం ఆకుపచ్చని చుడిదార్ వేసుకుని అందరి చూపును తలవైపు తిప్పుకుంది రకుల్.

థ్రెడ్ ఎంబ్రాయిడరీ సీక్విన్ డీటెయిల్స్, డీప్ నెక్ లైన్, స్లీవ్ లెస్ తో వచ్చిన షార్ట్ టాప్ వేసుకొని క్లీవేజ్ షో చేసి రెచ్చిపోయింది రకుల్. ఈ టాప్ కు బెల్ బాటమ్ డీటెయిల్స్ కలిగి ప్లీట్స్ తో వచ్చిన ప్యాంటును జత చేసింది. థ్రెడ్ ఎంబ్రాయిడరీతో వచ్చిన నెట్టెడ్ దుపట్టాను చేతుల గుండా వేసుకొని స్టాండింగ్ లుక్ తో కుర్రాలను ఫిదా చేసింది రకుల్. దీపావళి పండుగకు ఇంకా సమయం ఉన్నా ఫ్యాషన్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంది చిన్నది.

ఈ అవుట్ ఫిట్ కు సెట్ అయ్యే విధంగా ఆక్సిడైజ్డ్ జ్యువల్లరీని ఎన్నుకుంది రకుల్. చెవులకు అతి భారీ సైజులో డిజైన్ చేసిన జుంకాలను పెట్టుకుని అందరి చూపులు తల వైపుకు తిప్పుకుంది. ఈ జుంకాలే ఈ ఫోటోషూట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. చేతి వేళ్లకు బంగారపు ఉంగరాలు చేతికి ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్ వేసుకొని కత్తిలా కనిపించింది రకుల్ ప్రీత్.
ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ అయిన ఈ పిక్స్ కు రకుల్ ఒక క్యాప్షన్ జోడించింది. కిక్ స్టార్టింగ్ దివాలి విత్ స్మైల్స్ అంటూ మెన్షన్ చేసింది. ఈ పిక్స్ చూసిన చాలామంది సెలబ్రిటీలు అమ్మడి లుక్స్ ను మెచ్చుకుంటూ హార్ట్ సింబల్స్ పోస్ట్ చేశారు.

