సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్స్ అయ్యి తరువాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామలు చాలా మంది ఉన్నారు. అయితే నార్త్ ఇండియా భామలకి సౌత్ సినిమాలతో స్టార్ ఇమేజ్ వచ్చిన కూడా ఓ రకమైన చిన్న చూపు ఉంటుంది. ఆ విషయాన్ని చాలా మంది హీరోయిన్స్ చాలా సందర్భాలలో బయట పెట్టారు. ముఖ్యంగా తెలుగు సినిమాలలో స్టార్స్ అయ్యి బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత మన సినిమాలని, ఇక్కడి దర్శకులు, హీరోలని, ప్రేక్షకుల మీద వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. అక్కడ కామెడీ టాక్ షోలలో తెలుగు సినిమాలని తక్కువ చేసి మాట్లాడటం వారికి అలవాటుగా మారిపోయింది.
ఈ విషయంలో నార్త్ భామలు ఎవరూ అతీతం కాదు. క్రేజ్ తెచ్చుకొని కోట్ల రెమ్యునరేషన్స్ తీసుకొని తీరా తెలుగు సినిమాల మీద విమర్శలు చేయడం హీరోయిన్స్ కి కామన్ అయిపొయింది. ఇక తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇప్పుడు తెలుగు హీరోల మీద దారుణమైన కామెంట్స్ చేసింది. ఈ బ్యూటీ తెలుగులో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అందరితో నటించింది. అయితే తెలుగులో ప్రస్తుతం పెద్దగా అవకాశాలు రాకపోయిన హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది.
తాజాగా ఓ టీవీషోలో తెలుగు హీరోల గురించి ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. బాలీవుడ్ హీరోలు హ్యాండ్సమ్ గా కనిపించేందుకు ఎన్నో జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. ఫిట్ గా ఉంటారు. కానీ ఇలాంటి క్వాలిటీస్ ఏమీ సౌత్ హీరోలలో లేవు. వారు అసలు అందం గురించి కానీ ఫిట్ న్యూస్ గురించి కానీ అస్సలు శ్రద్ధ పెట్టరు అంటూ టాలీవుడ్ హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రకుల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలుగు సినిమా అభిమానులు ఆమెని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అయితే దీనిపై ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి.