Rakul Preet Singh : సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉంటూనే హాట్ ఫోటో షూట్‌లను చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా బాలీవుడ్ బాట పట్టిన ఈ పొడవుకాళ్ల సుందరి రోజుకో హాట్ ఫోటో షూట్ చేస్తూ కుర్రాల దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది. తాజాగా ఈ చిన్నది వైట్ కలర్ అవుట్‌ఫిట్ వేసుకుని నెట్టింట్లో సందడి చేస్తోంది. తన అప్‌కమింగ్ మూవీ థ్యాంక్ గాడ్ ప్రమోషన్ ను ఫ్యాషన్‌తో చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది.

Rakul Preet Singh : టీ సీరీస్ మారుతీ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్‌లో ఇంద్ర కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా థ్యాంక్ గాడ్. అజయ్ దేవగన్, సిద్ధార్ధ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్‌లు హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 25న దీపావళి సందర్భంగా రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ రంగం సిద్ధం చేసుకుంది.

ఈ నేపథ్యంలో ప్రమోషన్‌లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు బాలీవుడ్ స్టార్స్. రకుల్ ప్రీత్ సింగ్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి అమేజింగ్ అవుట్‌ఫిట్స్ వేసుకుని ప్రమోషన్‌ను హాట్ లుక్స్‌తో చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా వైట్ కలర్ కో ఆర్డ్ సెట్ వేసుకుని ఈ చిన్నది అందరిని అలరించింది.

ఫుల్ స్లీవ్స్, లేస్ వర్క్‌తో వచ్చిన ఈ డ్రెస్‌లో రకుల్ చందమామలా మెరిసిపోయింది. పూర్య వైట్ డ్రెస్‌లో దేవకన్యలా కనిపించి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. తన హైట్ ,ఫిగర్‌కు కరెక్ట్‌గా సూట్ అయ్యేలా ఈ అవుట్‌ఫిట్‌ను డిజైన్ చేశారు డిజైనర్లు. నడుముకు వచ్చిన బెల్ట్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది.

ఈ మధ్యనే రకుల్ ప్రీత్ సింగ్ బ్లాక్ కలర్ అవుట్‌ఫిట్ వేసుకుని కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేసింది . బ్లాక్ కలర్ బ్రాలెట్, ఫ్లేర్డ్ ప్యాంట్ వేసుకుని హాట్ ఫోటో షూట్ చేసి ఇంటెర్నెట్‌లో ట్రాఫిక్ జామ్ చేసింది. క్లాతింగ్ లేబుల్ షోపో నుంచి ఈ బ్లాక్ అవుట్‌ఫిట్‌ను ఎన్నుకుంది రకుల్ ప్రీత్ సింగ్. తన వైబ్రంట్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది.

బోల్డ్ స్ట్రాప్స్, ప్లంగింగ్ నెక్‌లైన్, స్లిట్ తో వచ్చిన బ్రాలెట్ వేసుకుని దానకి మ్యాచింగ్‌గా హై రైజ్ వెయిస్ట్ లైన్‌తో వచ్చిన బ్లాక్ ప్యాంట్ వేసుకుంది. బ్రాలెట్ మీదుగా క్వార్టర్ లెన్త్ స్లీవ్స్, మల్టీకలర్ సీక్విన్ అలంకరణలతో వచ్చిన నాట్చ్ లేపెల్డ్ జాకెట్ వేసుకుని తన లుక్‌ని పూర్తి చేసింది ఈ బ్యూటీ.

ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా రకుల్ పాదాలకు స్ట్రాప్ బ్లాక్ హీల్స్, చెవులకు డ్యాంగ్లింగ్ ఇయర్‌రింగ్స్ పెట్టుకుని అదరగొట్టింది. కనులకు ఐ ష్యాడో, మస్కరా, పెదాలకు మావీ లిప్ షేడ్ వేసుకుని మెరిసేటి ఛర్మంతో యూత్‌ను మెస్మరైజ్ చేసింది.
