గత కొంతకాలంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటుంది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా థియేటర్ కి వచ్చిన ప్రతి సినిమా డిజాస్టర్ టాక్ తో భారీ నష్టాలని నిర్మాతలకి మిగుల్చుతుంది. దీంతో సినిమాని రిలీజ్ చేయాలంటేనే నిర్మాతలు భయపడిపోతున్నారు. స్టార్ హీరోల సినిమాలు కూడా అదే స్థాయిలో భారీ డిజాస్టర్స్ గా మిగులుతున్నాయి. ఏ మాత్రం ప్రేక్షకులని ఆకట్టుకోవడం లేదు. సోషల్ మీడియాలో బాయ్ కట్ బాలీవుడ్ ట్రెండ్ కి బలం చేకూర్చేవిధంగా వారి సినిమాల రిజల్ట్ కూడా ఉంటున్నాయి. అప్పుడప్పుడు కొన్ని సినిమాలు సక్సెస్ అవుతున్న అవి బాలీవుడ్ ఇండస్ట్రీని కాపాడలేకపోతున్నాయి.
బాలీవుడ్ లో కమర్షియల్ బెల్ట్ నుంచి బయటకి వచ్చి కొత్తదనం ఉన్న కంటెంట్ తో సినిమాలు చేసే వారు కొంత సక్సెస్ అవుతున్నారు. అయితే ఒక వర్గం బాలీవుడ్ మాఫియా అలాంటి సినిమాలని ప్రమోట్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మాఫియా బెల్ట్ నుంచి వచ్చే సినిమాలు మాత్రం భారీబడ్జెట్ తో తెరకెక్కించి భారీగా ప్రమోట్ చేసి రిలీజ్ చేసిన ప్రేక్షకుల తిరస్కరణకి గురవుతున్నాయి. ఇదే సమయంలో సౌత్ లో తెలుగు సినిమాల ఆధిపత్యం బాలీవుడ్ పై ఉంది. ఈ దీంతో ఒకప్పుడు తెలుగు సినిమాని చిన్న చూపు చూసిన స్టార్స్ అందరూ ఇక్కడికి వచ్చి మరీ తమ సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే బాలీవుడ్ సినిమాలు ఫ్లాప్ కావడానికి తాజాగా క్రిష్ సిరీస్ చిత్రాల దర్శకుడు రాకేష్ రోషన్ అసలు రీజన్ చెప్పాడు. బాలీవుడ్ లో దర్శకులు సినిమా అని చెప్పి చెత్తని తీసుకొని ప్రమోట్ చేస్తున్నారని విమర్శలు చేశారు. అసలు మన మూలాలు మరిచిపోయి కథని తెరకెక్కించి బోర్లా పడుతున్నారని దుయ్యబట్టారు. అదే తెలుగులో మూలాల్ని మరిచిపోకుండా సమాజంలో ఉన్న కథలకి కాస్తా గ్రాండియర్ తీసుకొచ్చి తెరకెక్కించి సక్సెస్ కొడుతున్నారని అన్నారు. హిందీలో వచ్చిన కరణ్ అర్జున్ సినిమాని కాస్తా మార్చి హై బడ్జెట్ లో బాహుబలిగా తెరకెక్కించారని అందుకే అది హిట్ అయ్యిందని చెప్పుకొచ్చాడు. మూలాలు మరిచిపోకుండా సినిమాచేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని అన్నారు.