Bigg boss 6 : బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లో సందడి చేసిన కంటెస్టెంట్స్‌లో రాజ్ ఒకడు. నిజానికి తన మెంటాలిటీ రీత్యా రాజ్ ఒక ఇంట్రావర్ట్. అలాగే కొన్ని వారాలు ఉన్నాడు కూడా. ఆ తరువాత తన తీరును మార్చుకున్నాడు. మాట్లాడటం మొదలు పెట్టాడు. తొలినాళ్లలో తనను చూసిన వారంతా రాజ్ త్వరలోనే ఎలిమినేట్ అవుతాడని భావించారు. కానీ బాగానే నిలదొక్కుకున్నాడు. తొలి వారం సిల్లీ నామినేషన్స్ చేసినా ఆ తరువాత మాత్రం తనను తాను సరిదిద్దుకున్నాడు.
పాయింట్స్ చక్కగా మాట్లాడుతూ.. ఆదిరెడ్డి, గీతూ వంటి వారి నోర్లు కూడా మూయించాడు. గీతూతో ఆర్గ్యుమెంట్ చేసిన విధానం రాజ్‌కు మంచి మైలేజ్ తీసుకు వచ్చింది. ఇక ఆ సమయంలోనే తన తల్లి ఫోన్ ద్వారా తప్పు లేకుంటే ఆర్గ్యుమెంటుకు దిగమంటూ బూస్ట్ ఇవ్వడం సహా అన్నీ మనోడికి బాగా కలిసొచ్చాయి. ఎలిమినేషన్‌కు ముందు కామెడీ విషయంలో కూడా ఎక్కడా తగ్గలేదు. చివరకు తన తల్లిని బిగ్‌బాస్ హౌస్‌లో చూడాలనుకున్నాడు. అలా తన తల్లిని బిగ్‌బాస్ హౌస్‌లోకి రప్పించిన మీదట ఎలిమినేట్ అయ్యాడు.
ఇక ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే.. రాజ్‌కి బిగ్‌బాస్ నిర్వాహకులు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు? మొత్తంగా అతను ఎంత సంపాదించాడు? ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న చర్చ ఇదే. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం రాజ్.. వారానికి రూ.25 వేల నుంచి 30 వేల రూపాయలు అందుకున్నాడట. మొత్తంగా రాజ్ బిగ్‌బాస్ హౌస్‌లో 12 వారాలు ఉన్నాడు. ఈ 12 వారాలకుగానూ రాజ్ మూడు లక్షల రూపాయలకు పైనే పారితోషికం అందుకున్నట్లు టాక్ నడుస్తోంది.