Rajinikanth:కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ తారాగణంతో తెరకెక్కుతున్న చిత్రం పొన్నియన్ సెల్వన్ 1(పీఎస్ 1). ఈ సినిమాలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్,త్రిష వంటి భారీ తారాగణంతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ లకు నిర్వహిస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నారు.ఇకపోతే మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ నటిస్తున్నటువంటి ఈ సినిమా ఒకప్పుడు రజనీకాంత్ నటించిన నరసింహ సినిమా కథ అని చాలామందికి తెలియదు.ఈ సినిమా కూడా రజనీకాంత్ నరసింహ సినిమా కథను పోలి ఉంటుందని అయితే నరసింహ సినిమాలో రజనీకాంత్ సౌందర్య రమ్యకృష్ణ నటించారు. ఈ సినిమాలో తారాగణం నటిస్తున్నారు.
ఇక అప్పట్లో నరసింహ కథను కూడా పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగానే తెరకెక్కించారని అయితే ఈ సినిమా కేవలం ఒక్క పార్ట్ మాత్రమే రాగా ఇప్పుడు ఇదే సినిమా కథ పొన్నియన్ సెల్వన్ పేరుతో మణిరత్నం దర్శకత్వంలో రెండు భాగాలుగా రాబోతోంది. పిరియాడికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నరసింహ సినిమా కథ అని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Rajinikanth: నరసింహ స్థాయిలో ఆదరణ దక్కుతుందా…
ఈ సినిమా నరసింహ సినిమా స్థాయిలో ఆదరణ సంపాదించుకుంటుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయగా తెలుగులో ఈ సినిమాని దిల్ రాజు సమర్పణలో విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఇక చాలా కాలం తర్వాత మణిరత్న దర్శకత్వంలో ఐశ్వర్య రాయ్ ఈ సినిమాలో నటించి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.