Rajini, Prabhas and Vijay : సూపర్ స్టార్ రజినీకాంత్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దళపతి విజయ్.. ముగ్గురూ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్స్. ముందే అనుకున్నాం కదా.. స్టార్స్ అని ఇక వీరి రెమ్యూనరేషన్ మామూలుగా ఉంటుందా? చుక్కలనంటుతోంది. ఈ ముగ్గురూ తెరపై కనిపిస్తే చాలు కాసుల వర్షం కురుస్తుంది. ఇక రజినీకాంత్ చరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పాలా? కనిపిస్తే కలెక్షన్ల సునామీయే. టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. తొలి మూడు రోజులు రజినీ సినిమాలు టాక్‌తో సంబంధం లేకుండా నడుస్తాయి. ఈ మూడు రోజుల్లోనే సినిమాకు పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేస్తుంది. ఆ రేంజ్‌లో వెండితెరను కొన్ని దశాబ్దాలుగా రజినీ శాసిస్తున్నారు కాబట్టి ఆయన రెమ్యూనరేషన్ చుక్కలనంటుతోంది.
‘జైలర్’ మూవీ కోసం తలైవా తీసుకుంటున్న పారితోషికం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నెల్సన్ దర్శకత్వం ఈ మూవీ కోసం రజనీకాంత్ ఏకంగా రూ.140 కోట్లు తీసుకుంటున్నాడట. దక్షిణాదికి చెందిన హీరోలలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్స్‌లో రజనీకాంత్ నెంబర్ వన్ అని టాక్. ఒకవేళ సినిమా ప్లాఫ్ అయితే.. రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చే స్టార్ కూడా తలైవానే కావడం గమనార్హం. ఇక ఇదే స్థాయిలో పారితోషికం అందుకుంటున్న హీరోలలో పాన్ ఇండియాస్టార్ ప్రభాస్ కూడా ఉన్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా కోసం ఏకంగా రూ.125 కోట్లు తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకూ ఏ తెలుగు హీరో కూడా ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకోలేదు.
Rajini, Prabhas and Vijay : రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు
ఇక రజినీ, ప్రభాస్ కోవకు చెందిన వాడే దళపతి విజయ్ కూడా. వంద కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలలో ‘దళపతి’ విజయ్ కూడా చేరాడు. ‘తుపాకి’ తర్వాత ఆయన నటించిన ప్రతి సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది. విజయ్ సినిమాలకు కలెక్షన్లు భారీ స్థాయిలో వస్తాయి. దీంతో విజయ్ కూడా తన పారితోషికాన్ని పెంచేశాడట. తాజాగా ఆయన నటిస్తున్న ‘వారసుడు’ చిత్రానికి రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురి సినిమాల విషయంలో నిర్మాతలు ఎంత రెమ్యూనరేషన్ అయినా ఇచ్చేందుకు వెనుకాడటం లేదని టాక్. మొత్తానికి ఈ ముగ్గురు స్టార్ హీరోల రెమ్యూనరేషన్ పెను సంచలనంగా మారింది.