గత కొంతకాలంగా ఫ్లాప్స్ తో సతమతమవుతున్న టాలీవుడ్ హీరో రాజశేఖర్ నేటి తరం దర్శకులతో సినిమాలు చేయడం వల్ల బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకొని హిట్ ట్రాక్ ఎక్కారు.ఇక ఆయన కూతుర్లు కూడా ఇప్పుడిప్పుడే సినిమాలలో హీరోయిన్స్ గా మెరుస్తూ ఆయన పేరును,గౌరవాన్ని పెంచుతున్నారు.సరిగ్గా ఇలాంటి సమయంలో రాజశేఖర్ ఇంట తాజాగా విషాదం ఛాయలు అలముకున్నాయి.నిన్న సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్ ( రిటైర్ట్ పోలీస్ డిప్యూటీ కమిషనర్) మృతి చెందారు.తాజాగా దీనిపై రాజశేఖర్ భార్య జీవిత రాజశేఖర్ ఒక ప్రకటనను విడుదల చేశారు.ఇందులో ఆమె హైదరాబాదులో నిన్న సాయంత్రం 6.30 గంటలకు మా మామగారు వరదరాజన్ చనిపోయారని చెప్పడానికి మేము చింతిస్తున్నాం.మా మామ గారి వయసు 94 సంవత్సరాలు.ఆయన భౌతికకాయాన్ని ఈరోజు చెన్నైకి తరలిస్తున్నాం.
చెన్నైలోని ఆయన ఇంటివద్ద (నంబర్ 26, AI బ్లాక్, 8వ మెయిన్ రోడ్డు, అన్నా నగర్, చెన్నై-40) ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని సాయంత్రం 4 తర్వాత ఉంచబోతున్నాం.ఇంకా అంత్యక్రియల సమయాన్ని నిర్ణయించలేదు.రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత అంత్యక్రియల నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నామని జీవిత ఈ ప్రకటనలో తెలిపారు.రాజశేఖర్ తండ్రిని సందర్శించడానికి టాలీవుడ్,కోలీవుడ్ ప్రముఖులు తరలి వెళ్లనున్నారని సమాచారం