కల్కి ప్రాజెక్ట్ లోకి రాజమౌళి ఎంట్రీ :
ప్రస్తుతం టాలీవుడ్ లో కేజ్రీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న మూవీ ల్లో ప్రాజెక్ట్ K సినిమా ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నఈ మూవీ పై ఇప్పటికే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ “ఆదిపురుష్” గా నిరాశపరచడంతో సలార్ సినిమాతో పాటు, ఈ సినిమా పైనే ఆయన ఫాన్స్ హోప్స్ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ కు సంబంధించి ప్రతి చిన్న విషయంపైనా ఫోకస్ చేస్తున్నారు.
ప్రాజెక్ట్ k మూవీ టైటిల్ ను కల్కి గా డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ లో ప్రభాస్ తో పాటు దీపిక పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ తో సహా పలువురు టాప్ నటులు నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా కల్కి నుంచి గ్లిమ్ప్స్ విడుదల అయిన సంగతి మనకి తెలిసిందే. ఈ మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ ఫాన్స్ అంచనాలను బీట్ చేసేలా ఫస్ట్ గ్లిమ్ప్స్ ను విడుదల చేసారు.దీనితో ఫాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు. నాగ్ అశ్విన్ ప్రతిభ ఈ ఒక్క గ్లిమ్ప్స్ లోనే కనిపిస్తోందని ఆయనను ఆకాశానికెత్తేశారు.

తాజాగా, ఈ సినిమాకు సంబంధించి మరో ట్రెండింగ్ వార్త ఈ మూవీ పై హైప్ క్రియేట్ చేస్తోంది. అదేంటంటే.. కల్కి ప్రాజెక్ట్ లో రాజమౌళి కూడా పని చేస్తున్నారు . ఇప్పటికే ఆయన ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యారంట . డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఆయన కూడా ఇన్వాల్వ్ అవుతున్నారని టాక్ కూడా వినిపిస్తోంది. ఆయన తన డైరెక్షన్ లో షూటింగ్ కూడా మొదలు పెట్టారని తెలుస్తోంది. ఒక్క పరాజయాన్ని చూడని డైరెక్టర్ గా, ఇండియాకి ఆస్కార్ తీసుకొచ్చిన డైరెక్టర్ గా రాజమౌళికి ఇప్పటికే పేరు వచ్చేసింది. అయితే.. ఇప్పుడు ఈ సినిమా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా గురించే చర్చలు జరిపేస్తోంది.